పెరిగిపోతున్న ఇంధన ధరలను తగ్గించాలని భాజపా మిత్రిపక్షమైన జేడీయూ.. నరేంద్ర మోదీ సర్కారుకు సూచించింది. తాజాగా వంటగ్యాస్ సిలిండర్ ధరల పెంపును (LPG Cylinder Price) ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఇటువంటి నిర్ణయాలు సాధారణ ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగీ పేర్కొన్నారు.
పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని భాజపాకు మిత్రపక్షం డిమాండ్
తాజాగా పెరిగిన పెట్రోల్, వంటగ్యాస్ ధరలను(LPG Cylinder Price) తగ్గించాలని భాజపా మిత్రపక్షం జేడీయూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించింది.
జేడీయూ
ఎల్పీజీ ధరలు పదేపదే పెంచడం వల్ల ప్రజల బడ్జెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. అంతేగాకుండా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను(Petrol price today) మార్కెట్‌కు అనుగుణంగా వదిలేయడాన్ని తప్పుపట్టారు. ప్రజాప్రయోజనార్థం ఈ ఖర్చులను అరికట్టేందుకు మోదీ సర్కారు తప్పక ముందుకు రావాలని అన్నారు.
ఇదీ చూడండి:ఇంధన ధరలపై మోదీ సర్కారుకు రాహుల్ చురకలు