ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన ఓ యువకుడు.. తన స్నేహితుడిపై పరువు నష్టం దావా వేశాడు. రూ.50 లక్షలు చెల్లించాలని నోటీసు పంపాడు. లేకపోతే కేసు పెడతానని చెప్పాడు. అందుకు గల కారణం తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.. అతడు వెళ్లినప్పటికీ స్నేహితుడి పెళ్లి బరాత్ అయిపోయిందని ఇలా చేశాడట. ఇంతకీ ఏం జరిగందంటే?
ఇదీ జరిగింది..హరిద్వార్‌లోని బహదరబాద్ ఆరాధ్యకాలనీలో నివాసం ఉంటున్న రవి అనే యువకుడికి గురువారం వివాహం జరిగింది. అయితే కంఖాల్ దేవ్‌నగర్‌లో రవి ప్రాణస్నేహితుడైన చంద్రశేఖర్ ఉంటాడు. అయితే తన పెళ్లికి మిగతా స్నేహితులందిరికీ ఆహ్వానించమని చంద్రశేఖర్‌కు రవి చెప్పాడు. ఎంతో హుషారుగా చంద్రశేఖర్.. రవి పెళ్లికి రావాలని, దాంతో పాటు గురువారం సాయంత్రం జరిగే బరాత్‌కు హజరవ్వాలని ఆహ్వానించాడు. అయితే చంద్రశేఖర్‌తో పాటు వారంతా గురువారం సాయంత్రం 4.30 గంటలకే రవి ఇంటికి చేరుకున్నారు. అక్కడే మొదలైంది అసలైన గొడవ!
వీరు అక్కడికి వెళ్లినప్పటికే.. రవి పెళ్లి బరాత్ అయిపోయింది. దీంతో వారంతా ఫీలయ్యారు. వరుడు రవికి ఫోన్ చేసి బరాత్ కోసం ఆరా తీశారు. అతడు పెళ్లి హడావుడిలో 'ఊరేగింపు అయిపోయిందని, మీరు వెళ్లిపోతే వెళ్లిపోండి' అని చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో చంద్రశేఖర్‌పై మిగతా స్నేహితులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనరాని మాటలు కూడా అన్నారు. దీంతో చంద్రశేఖర్.. రవిపై కోపం పెంచుకున్నాడు.