బిట్‌కాయిన్ పేరుతో జరిగిన మోసంలో కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వాసప్ప లోకప్ప అనే వ్యాపారి రూ. 45 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘరానా మోసంలో ఐదుగులు సైబర్ నేరగాళ్లు ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. వారిలో దిల్లీకి చెందిన అమిత్ భరద్వాజ్, అజయ్ భరద్వాజ్‌లు ప్రస్తుతం స్థానికంగా బిట్‌కాయిన్ వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నాడు.
వీరంతా నగరంలో ఉండే ప్రముఖ వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని.. చేతన్ పాటిల్ అనే స్థానికునితో మొదటగా మాట్లాడిస్తారని తెలిపాడు. ఇందుకు మంచి హంగులు ఉండే హోటళ్లను ఎంచుకుంటారని పేర్కొన్నాడు. ఆ సమావేశంలో బిట్ కాయిన్లో పెట్టుబడులు పెడితే లక్షలు ఆర్జించవచ్చని నమ్మిస్తారని చెప్పాడు. అలా వారిని నమ్మి తాను కూడా రూ. 45 లక్షలు పోగొట్టుకున్నట్లు గోడు వెళ్లబోసుకున్నాడు.
నిందితులపై కామారిపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు బాధితుడు.