తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Nun rape case: అత్యాచారం కేసులో క్యాథలిక్​ బిషప్​ను నిర్దోషిగా తేల్చిన కోర్టు - అత్యాచారం కేసులు

Nun rape case: నన్​పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ రోమన్​ క్యాథలిక్​ బిషప్​.. ఫ్రాంకో ములక్కల్​ను నిర్దోషిగా తేల్చింది కొట్టాయం జిల్లా అదనపు సెషన్స్​ కోర్టు. తీర్పు సందర్భంగా కోర్టు ఆవరణలోనే భావోద్వేగానికి లోనయ్యారు ములక్కల్​.

Nun rape case
క్యాథలిక్​ బిషప్​ ఫ్రాంకో ములక్కల్​

By

Published : Jan 14, 2022, 1:28 PM IST

Updated : Jan 14, 2022, 2:17 PM IST

Nun rape case: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ రోమన్‌ క్యాథలిక్‌ బిషప్‌.. ఫ్రాంకో ములక్కల్‌కు ఊరట లభించింది. ఆయనను నిర్దోషిగా తేలుస్తూ కొట్టాయం జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది.

ములక్కల్‌పై వచ్చిన ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ సరైన ఆధారాలను సమర్పించలేదనే కారణంతో అదనపు సెషన్స్​ న్యాయమూర్తి గోపకుమార్​.. ఆయనను నిర్దోషిగా ప్రకటించారు. కోర్టుకు హాజరైన ములక్కల్​.. తీర్పు వెలువరించిన క్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు. దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని తాను ఎప్పుడూ నమ్ముతానని తెలిపారు.

ములక్కల్‌ తనపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారని నన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కొట్టాయం జిల్లా పోలీసులు 2018లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఫ్రాంకో ములక్కల్‌ను అదే ఏడాది అరెస్టు చేసింది. అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఏడాదిన్నర తర్వాత తీర్పు వచ్చింది.

ఇదీ చూడండి:రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్​ నటి కూతురు మృతి

Last Updated : Jan 14, 2022, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details