BIS Consultant Jobs 2023 : ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) 107 కన్సల్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ఆయుష్ డిపార్ట్మెంట్ - 4
- సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ - 15
- కెమికల్ డిపార్ట్మెంట్ - 6
- ఎలక్ట్రోటెక్నికల్ డిపార్ట్మెంట్ - 6
- ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ - 6
- ఎలక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ - 3
- మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ - 7
- మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ హాస్పిటల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ - 2
- మెటలర్జికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ - 9
- మేనేజ్మెంట్ అండ్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ - 5
- పెట్రోలియం కోల్ అండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్ - 5
- ప్రొడక్షన్ అండ్ జనరల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ - 10
- సర్వీస్ సెక్టార్ డిపార్ట్మెంట్ - 8
- ట్రాన్స్పోర్ట్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ - 7
- టెక్స్టైల్ డిపార్ట్మెంట్ - 8
- వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ - 6
- మొత్తం పోస్టులు - 107
విద్యార్హతలు
BIS Consultant Qualifications :ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
BIS Consultant Age Limit :అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 65 సంవత్సరాలు.
అప్లికేషన్ ఫీజు
BIS Consultant Application Fee :అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
BIS Consultant Selection Process :విద్యార్హతలు, పని అనుభవం సహా, ఆయా పోస్టులకు అనుగుణంగా వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.