తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కోడి పుంజు'కు ఘనంగా పుట్టినరోజు వేడుకలు

మంసాహార ప్రియులకు కోడి కనిపిస్తే.. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనుకుంటారు! కానీ కొందరు జంతుప్రేమికులు మాత్రం వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అలాంటి ఓ కుటుంబం.. వారు పెంచుకుంటున్న కోడికి ఏకంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించింది. సంప్రదాయ పద్ధతిలో ఇంటిని అలంకరించి.. దానికి ఇష్టమైన ఆహారాన్ని తినిపించింది.

కోడి పుట్టినరోజు
కోడి

By

Published : Sep 26, 2021, 2:45 PM IST

Updated : Sep 26, 2021, 3:53 PM IST

'కోడి పుంజు'కు ఘనంగా పుట్టినరోజు వేడుకలు

శునకాలు, ఆవులు.. ఇలా పెంపుడు జంతువులకు అట్టహాసంగా జన్మదిన వేడుకలు జరిపిన సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. అయితే నాన్​వెజ్​ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే కోడికి పుట్టిన రోజు చేయడం ఎప్పుడైనా చూశారా? కనీసం ఎక్కడైనా విన్నారా? లేదు కదా! అయితే మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం ఓ కోడి పుంజుకు తొలి పుట్టినరోజు జరిపి వార్తల్లో నిలిచింది.

ఇంటిని అలంకరించి పుట్టిన రోజు వేడుకలు

అనుకోకుండా..

నాగ్​పుర్​ జిల్లా ఉమ్రేడ్​ తాలూకాలోని మంగళ్​వార్​ పేఠ్​కు చెందిన ఉమాకాంత్​ కాగ్దేల్వార్​కు ఏడాది క్రితం ఓ కోడిపిల్ల ​దొరికింది. ఆ కొడిపిల్ల పౌల్ట్రీ వ్యాన్​ నుంచి జారి, అతని షాపు ముందు పడింది. అప్పటి నుంచి దానిని కోడిలా కాకుండా.. తమ కుటుంబంలో ఓ సభ్యుడిలా భావించి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ కుటుంబమంతా దీనిని 'కుచాశేత్' అని పిలుస్తుంది.

కోడికి బొట్టుపెడుతున్న యజమానిరాలు
కోడికి ఆహారాన్ని తినిపిస్తున్న కుటుంబ సభ్యులు

బర్త్​డే సెలబ్రేషన్స్..

పుత్ర సంతానం లేని ఉమాకాంత్.. ఆ కోడిని కొడుకులానే భావిస్తున్నారు. అతని కుమార్తె సురభి కూడా కుచాశేత్​​ను తమ్ముడిలా భావించి.. దాని ఆలనాపాలనా చూసుకుంటోంది. కుచాశేత్​​కు ఈ నెల 20 తేదీకి ఏడాది పూర్తయింది. దీంతో ఆ కోడికి సంప్రదాయ పద్ధతిలో తొలి పుట్టినరోజు జరిపించారు. తమ ఇంటిని అలంకరించారు. ఆ కోడి ఇష్టమైన జీడీపప్పు, వేరుశెనగ, శ్రీఖండ్ వంటి​ ఆహార పదర్థాలను తినిపించారు. కోడి బర్త్​డే సెలబ్రేషన్స్​కు సంబంధించిదన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు.. 'కోడికి పుట్టిన రోజు ఏంటో'.. అని ఆశ్చర్యపోతున్నారు.

బర్త్​ డే కోడికి హారతి ఇస్తూ..
బర్త్​ డే కోడికి హారతి ఇస్తూ..

ఇవీ చూడండి:

Last Updated : Sep 26, 2021, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details