తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Birth And Death Registration : బర్త్​ సర్టిఫికెట్ కొత్త రూల్స్​​.. హెల్త్​ డిపార్ట్​మెంటే కాదు.. ఇక వాళ్లు కూడా ఇవ్వొచ్చు! - Birth And Death Registration database

Birth And Death Registration Act 2023 : పార్లమెంట్​ ఆమోదం పొందిన జనన మరణాల నమోదు (సవరణ) చట్టం 2023.. అక్టోబర్​ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ చట్టం జనన మరణాలను నివేదించే అధికారాలను నిర్దిష్ట జాబితాలోని వ్యక్తులకు కట్టబెట్టింది. దీంతోపాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో జనన మరణాల డేటాబేస్​ను నిర్వహించేందుకు రిజిస్ట్రార్​ జనరల్​, చీఫ్​ రిజస్ట్రార్​, రిజిస్ట్రార్లకు బాధ్యతలు అప్పగించింది.

Birth And Death Registration Act 2023
Birth And Death Registration Act 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 4:27 PM IST

Birth And Death Registration Act 2023 :జనన మరణాల నమోదు (సవరణ) చట్టం.. 2023 అక్టోబర్​ 1 నుంచి అమలులోకి రానుంది. ఇందులో భాగంగా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, డ్రైవింగ్​ లైసెన్స్​ జారీ చేయడానికి, ఓటర్ జాబితాను సిద్ధం చేయడానికి, ఆధార్​, వివాహా రిజిస్ట్రేషన్, ఉద్యోగ నియామకాలు తదితర అవసరాల కోసం సింగిల్ డాక్యుమెంట్​ (Single Document Birth Certificate) జనన ధ్రువీకరణ పత్రం ఉపయోగిస్తారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ జారీ చేసిన నోటిఫికేషన్​లో పేర్కొంది. దీని ద్వారా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జనన మరణాల డేటాబేస్​లు ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపింది. ఫలితంగా ప్రజలందరికీ పారదర్శకంగా సేవలను, సామాజిక ప్రయోజనాలను చేరువ చేయవచ్చని వెల్లడించింది. వివరాలను పారదర్శకంగా, సమర్థవంతంగా డిజిటల్​ పద్ధతిలో నమోదు చేయొచ్చని తెలిపింది.

1969 చట్టానికి (Birth And Death Registration Act 1969) సవరణ కోరుతూ ఈ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఆగస్టు 1న లోక్​సభ ఆమోదించగా.. ఆగస్టు 7న రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం.. జనన మరణాలు నమోదిత డేటాబేస్​ను నిర్వహించడానికి రిజస్ట్రార్​ జనరల్ ఆఫ్​ ఇండియాకు (Registrar General Of India) అధికారం కల్పిస్తుంది. ఇక,​ రాష్ట్ర స్థాయిలో చీఫ్​ రిజస్ట్రార్ ఇలాంటి డేటాబేస్​ను నిర్వహిస్తారు. చీఫ్ రిజిస్ట్రార్లు (రాష్ట్రాలు నియమించే అధికారులు), రిజిస్ట్రార్లు (స్థానిక ప్రాంత అధికార పరిధి కోసం రాష్ట్రాలు నియమించే అధికారులు) రాష్ట్ర స్థాయిలో జనన మరణ సమాచారాన్ని జాతీయ డేటాబేస్​తో పంచుకోవడానికి బాధ్యత వహిస్తారు.

ఇంతకుముందు వైద్యాధికారి మాత్రమే జనన మరణాలను రిజిస్ట్రార్​కు నివేదించడానికి వీలు ఉండేది. అయితే ఈ కొత్త చట్టం ప్రకారం ఈ పనిని కేంద్రం తయారుచేసిన నిర్దిష్ట జాబితాలోని వ్యక్తులు చేయవచ్చు. శిశువు తల్లిదండ్రులు, జననాన్ని రిపోర్ట్​ చేసేవారి ఆధార్​ నంబర్​ను కూడా రిజిస్ట్రార్​కు నివేదించాలి. ఒకవేళ ప్రసవాలు జైలులో జరిగితే జైలర్, హోటల్/లాడ్జి​లో జరిగితే హోటల్ మేనేజర్ వంటి తదితరులు నివేదించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఈ డేటాబేస్​లో.. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు, అద్దె గర్భం ద్వారా జన్మించిన పిల్లల బయోలాజికల్​ పేరెంట్స్​, అవివాహితకు జన్మించిన పిల్లల తల్లిదండ్రుల వివరాలను సైతం నమోదు చేయనున్నారు.

ఈ కొత్త చట్టం ప్రకారం జనాభా, ఓటర్ జాబితా, రేషన్ కార్డులు వంటి తదితర డేటాబేస్​లను ఏర్పాటు చేసే లేదా నిర్వహించే అధికారులకు.. ఈ జనన మరణాల జాతీయ డేటాబేస్​ అందుబాటులో ఉంటుంది. జనన మరణాల నమోదు ప్రక్రియలో రిజిస్ట్రార్ల ఉత్తర్వులు లేదా చర్యల ద్వారా ఇబ్బంది ఏర్పడితే.. జిల్లా రిజిస్ట్రార్​ లేదా చీఫ్​ రిజిస్టార్లకు అప్పీల్​ చేసుకునే వెసులుబాటును ఈ చట్టం పౌరులకు కల్పిస్తుంది. అలాంటి చర్య లేదా ఆర్డర్​ అందిన నుంచి 30 రోజులలోపు అప్పీల్​ చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఇక దీనికి అప్పీలేట్ అధికారి 90 రోజుల్లోపు తన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై బర్త్​ సర్టిఫికెట్​తో పాటు ఆధార్​

'జనన, మరణ సర్టిఫికెట్ల జారీ ఇక వెంటనే'

ABOUT THE AUTHOR

...view details