Biren Singh: మణిపుర్ ముఖ్యమంత్రిగా మళ్లీ బీరేన్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంఫాల్‌లో ఆదివారం జరిగిన మణిపుర్ భాజపా శాసనసభాపక్ష సమావేశంలో.. తదుపరి ముఖ్యమంత్రిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకుగానూ.. భాజపా ఒంటరిగా పోటీ చేసి 32 చోట్ల గెలుపొందింది. 2017లో నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్స్ పీపుల్స్ పార్టీల మద్దతుతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈసారి మాత్రం సింగిల్‌గానే మేజిక్ ఫిగర్‌ను చేరుకుంది.
బీరేన్ సింగ్.. హెయ్గాంగ్ నియోజకవర్గంలో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంగిజం శరత్చంద్ర సింగ్‌పై 17 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. దీంతో వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు సింగ్.
గవర్నర్‌ను కలిసిన భాజపా నేతలు
మణిపుర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా భాజపా నేతలు ఆ రాష్ట్ర గవర్నర్ లా గణేషన్‌ను కలిశారు. తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమని గవర్నర్‌కు పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో.. భాజపా పరిశీలకులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, పార్టీ నేతలు భూపేందర్ యాదవ్, సంబిత్ పాత్ర, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శర్ద దేవి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సోమవారం శాసనసభాపక్ష భేటీ