ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుంచి కోల్‌కతా వెళుతున్న విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని లఖ్‌నవూ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు అధికారులు. ఫ్లైట్ i5-319 టేక్ఆఫ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. విమానాన్ని క్షుణ్నంగా పరీక్షించేందుకే ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు.
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. కాసేపు టెన్షన్ టెన్షన్.. చివరకు సేఫ్‌గా.. - plane emergency landing in Uttar Pradesh
విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో ఫ్లైట్‌ను అత్యవరంగా ల్యాండ్ చేశారు అధికారులు. లఖ్‌నవూ నుంచి కోల్‌కతా వెళ్తుండగా జరిగిందీ ఘటన. మరోవైపు విమానంలో అత్యవసర ద్వారం కవర్‌ను తొలగించేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. దీంతో అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంది ఎయిర్‌లైన్స్.
విమాన ప్రయాణికుడిపై కేసు..
మహారాష్ట్రలో విమాన ప్రయాణికుడిపై కేసు నమోదైంది. విమాన అత్యవసర ద్వారం కవర్‌ను తొలగించేందుకు అతడు ప్రయత్నించాడు. దీంతో అతడిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. నాగ్‌పుర్ నుంచి ముంబయి వెళుతున్న 6E-5274 ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు కాసేపటి ముందు ఈ ఘటన జరిగింది.
"ఓ ప్రయాణికుడు విమానంలో అత్యవసర ద్వారం కవర్‌ను తొలగించేందుకు ప్రయత్నించాడు. గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అనంతరం ప్రయాణికుడిని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ప్రయాణికుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం." అని ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.