బర్డ్ ఫ్లూ దేశ రాజధాని దిల్లీకి విస్తరించింది. ఇటీవల ఓ పార్క్‌లో పక్షులు మరణించగా అప్రమత్తమైన అధికారులు.. 8 నమూనాలు భోపాల్ ల్యాబ్‌కు పంపించారు. వాటిలో వైరస్ ఉన్నట్లు తేలింది.
బర్డ్ ఫ్లూ నిర్ధరణ అయిన వాటిలో నాలుగు మయూర్ విహార్ ఫేజ్-3లోని పార్క్‌కు చెందినవని కాగా.. సంజయ్ లేక్‌లో మూడు, ద్వారాకలో ఒకటి ఉన్నాయని పశుసంవర్ధక విభాగానికి చెందిన డాక్టర్ రాకేశ్ సింగ్ తెలిపారు. మరికొన్ని నమూనాలను జలంధర్ ల్యాబ్‌కు పంపించామని, వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.