ప్రకృతిలో అద్భుతాలకు అంతు లేదు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా(Viral) మారింది. ఓ పక్షి తన గూడును చిన్న ఆకులో కట్టుకుంది. ముడుచుకున్న ఆకు లోపల ఉన్న పక్షి గూడును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆకును ఆధారంగా చేసుకొని గూడును నిర్మించిన పక్షి పనితనాన్ని మెచ్చుకుంటున్నారు.
పది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు ఓ యూజర్. ఆ గూడులో చిన్న చిన్న పక్షి గుడ్లు సైతం ఉన్నాయి. ఆకు చివరి రెండు కొనలను ఒక్కదగ్గరికి కుట్టి.. దానిపై పక్షి గూడు నిర్మించినట్లు తెలుస్తోంది.