Birbhum killings: బంగాల్ బీర్భుమ్ ఘటనను మరవకముందే బోగ్తుయ్ గ్రామంలో 40 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నాలుగు బకెట్లలో ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లో నాటు బాంబులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు బీర్భుమ్ ఎస్పీ నాగేంద్ర నాథ్ త్రిపాటి తెలిపారు.
అంతకుముందు.. బంగాల్లో బీర్భుమ్ సజీవ దహనాల కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేపట్టింది. మార్చి 26నుంచి విచారణ ప్రారంభించింది. బీర్భుమ్ హింసపై సీబీఐ విచారణ జరపాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 7లోగా సీబీఐ నివేదిక సమర్పించాలని జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్ భరద్వాజతో కూడిన ధర్మాసనం తెలిపింది.
బీర్భుమ్ ఘటన తర్వాత బోగ్తుయ్ గ్రామంలోని ప్రజలు.. చుట్టుపక్కల గ్రామాలకు పారిపోతున్నారు. మళ్లీ ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న భయంతో ఉన్నారు గ్రామస్థులు.