ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు శనివారం తన రాజీనామా లేఖను అందించారు. త్రిపురలో పార్టీని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలిపారు.
త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ రాజీనామా.. మానిక్ సాహాకు పగ్గాలు
16:22 May 14
త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ రాజీనామా.. మానిక్ సాహాకు పగ్గాలు
"పార్టీకంటే ఎక్కువ ఏమీ కాదు. నేను నమ్మకమైన భాజపా కార్యకర్తను. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాననే అనుకుంటున్నా. త్రిపుర సమగ్ర అభివృద్ధికి నేను కృషి చేశా. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పని చేశా. 2023 ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. బాధ్యతాయుతమైన వ్యక్తి ఉంటేనే పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం. సంస్థాగతంగా బలంగా ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటు సులభమవుతుంది. ఎన్నికల తర్వాత ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు కదా. భాజపాను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి నేను పనిచేయాలని పార్టీ కోరుకుంటోంది."
-బిప్లవ్ కుమార్ దేవ్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి
కాగా, త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా మానిక్ సాహాను ఎంపిక చేసింది భాజపా అధిష్ఠానం. పార్టీ సమావేశంలో చర్చించి ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు నేతలు తెలిపారు. భాజపా తరపున పోటీ చేసి ముఖ్యమంత్రిగా ఎన్నికైన బిప్లవ్.. 2018 మార్చిలో బాధ్యతలు చేపట్టారు. 2023 మార్చిలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది.