తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వీరుడా వందనం'.. రావత్​కు జనభారతం తుది వీడ్కోలు - మధులికా రావత్​

Bipin Rawat funeral: దిల్లీలోని బార్​ స్క్వేర్​ శ్మశానవాటికలో.. సీడీఎస్​ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి మధులికా రావత్​ అంత్యక్రియలు సైనిక లాంఛనాలు, బంధుమిత్రల అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబసభ్యులు, ప్రజలు రావత్​ దంపతులకు కన్నీటి వీడ్కోలు పలికారు.

bipin rawat funeral
బిపిన్​ రావత్​ అంత్యక్రియలు

By

Published : Dec 10, 2021, 4:43 PM IST

Updated : Dec 10, 2021, 6:32 PM IST

'వీరుడా వందనం'.. రావత్​కు జనభారతం తుది వీడ్కోలు

Last rites of CDS: దేశ రక్షణ కోసం జీవితాన్ని అర్పించి, సైన్యంలో సుదీర్ఘ సేవలందించిన భారత తొలి త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​కు ప్రజలు అంతిమ వీడ్కోలు పలికారు. దిల్లీలోని బార్​ స్క్వేర్​ శ్మశానవాటికలో.. బిపిన్​ రావత్​, మధులికా రావత్​ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో శుక్రవారం సాయంత్రం జరిగాయి. రావత్​కు గౌరవసూచికగా.. 17 తుపాకులతో వందనం చేసింది సైన్యం. కుటుంబసభ్యులు, దాదాపు 800మంది మిలిటరీ సిబ్బంది.. రావత్​ దంపతులకు తుది వీడ్కోలు పలికారు.

రావత్​ దంపతులకు కుమార్తెల కన్నీటి వీడ్కోలు
బార్​ స్క్వేర్​ శ్మశానవాటికలో..

అంతకుముందు.. శ్మశానవాటికలో రావత్​ దంపతులకు కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​తో పాటు వివిధ దేశాల రక్షణశాఖ అధికారులు నివాళులర్పించారు.

రావత్​ దంపతులకు రాజ్​నాథ్​ నివాళి

అంతిమయాత్ర..

Bipin Rawat funeral procession:

శుక్రవారం ఉదయం ప్రజల సందర్శనార్థం.. రావత్​ దంపతుల పార్థివ దేహాలను వారి ఇంట్లో ఉంచారు. కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, త్రివిధ దళాల సారథులు, కుటుంబసభ్యులు బిపిన్​ రావత్​, మధులికకు నివాళులర్పించారు.

ఆ తర్వాత.. వారి నివాసం నుంచి బార్​ స్క్వేర్​ శ్మాశనవాటిక వరకు రావత్​ దంపతుల అంతిమయాత్ర సాగింది. దారిపొడవునా రావత్​కు ప్రజలు సెల్యూట్​ చేశారు. 'సూర్యుడు- చంద్రుడు ఉన్నంత కాలం రావత్​జీ పేరు ఎవరూ మర్చిపోరు', 'భారత్​ మాతాకీ జై' అంటూ ప్రజలు నినాదాలు చేశారు.

రావత్​ దంపతుల అంతిమయాత్ర
రావత్​ దంపతుల అంతిమయాత్ర
దిల్లీలో రావత్​ దంపతుల అంతిమయాత్ర

హెలికాప్టర్​ ప్రమాదం..

తమిళనాడులో బుధవారం.. త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ (63), ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నీలగిరి జిల్లా కూనూర్‌ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్‌ రావత్‌ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి:-బ్రిగేడియర్‌ లిద్దర్‌కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

Last Updated : Dec 10, 2021, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details