దిల్లీ ద్వారకాలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తన మాజీ ప్రేయసిపై ప్రతీకారంతో రగిలిపోయి.. నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపాడు. ఆ 22 ఏళ్ల యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బిందాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఆమెతో ఉన్న మరో వ్యక్తి కాపాడేందుకు ప్రయత్నించినా.. ప్రాణాలు దక్కలేదు.
కూతురు మరణవార్త విన్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పుట్టినరోజు వేడుకలు చేసుకుంటానని రాత్రివేళ వెళ్లి.. తిరిగిరాలేదని బోరున విలపించారు. తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు.