కర్ణాటక మైసూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మరణించారు. ఈ ఘటనకు పోలీసులే కారణమంటూ.. వారిపై దాడి చేశారు స్థానికులు.
ఇదీ జరిగింది
కర్ణాటక మైసూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మరణించారు. ఈ ఘటనకు పోలీసులే కారణమంటూ.. వారిపై దాడి చేశారు స్థానికులు.
ఇదీ జరిగింది
జిల్లాలోని హింకల్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనదారుడిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అతను తప్పించుకోవడానికి యత్నించగా.. లాఠీతో కొట్టారు పోలీసులు. ఆ లాఠీ.. హ్యాండిల్లో ఇరుక్కుపోయి బైక్ అదుపు తప్పింది. ఇంతలో వెనుక నుంచి వస్తున్న ఓ వ్యాన్.. బైక్ను ఢీకొట్టింది. ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని స్వల్పంగా ధ్వంసం చేశారు. అనంతరం పోలీసులపై దాడి చేశారు.
ఇదీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం- 13మంది దుర్మరణం