తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే బైక్​పై 10మంది ప్రయాణం.. ఇదెక్కడి ఐడియా గురూ! - మధ్యప్రదేశ్​ వార్తలు

పెట్రోల్​ ధరల వరుస పెరుగుదలతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అయితే.. ఈ సమయంలో చాలా మంది బైక్​లపై (Bike viral video) వెళ్లడం తగ్గించడమో లేక ప్రయాణాలు మానుకోవడమో చేస్తున్నారు. కానీ.. ఓ వ్యక్తి(Desi jugaad video) చేసింది చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. తనతో కలిపి ఏకంగా 10 మంది ద్విచక్రవాహనంపై ప్రయాణించారు. అసలు ఇదెలా సాధ్యమైంది అనుకుంటున్నారా? ఇది చూసేయండి మరి..

Bike or Plane? Desi Jugaad Comes Handy For Carpooling Amid Petrol Hike
బైక్​పై 10 మంది.. రోడ్డుపై విమానంలా డ్రైవ్​ చేశాడు!

By

Published : Oct 31, 2021, 12:10 PM IST

రోడ్లపై విమానం ప్రయాణించడం చూశారా? ఇదేంటి అనుకుంటున్నారా? అవును అలాంటి బైక్​ను రూపొందించాడో వ్యక్తి (Desi jugaad video). ఓ వైపు పెట్రోల్​ రేట్ల పెరుగుదల.. ఇంకోవైపు బయట ఖర్చులు భరించలేకపోవడం.. అంతే ఏదైనా కొత్తగా సృష్టించాలనుకున్నాడు. విమానం రెక్కల్లా మోటార్​ బైక్​కు(Bike viral video) చెక్క బల్లలు జోడించి.. వాటిపై తన కుటుంబసభ్యులను కూర్చోబెట్టుకున్నాడు. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 9 మందితో బైక్​పై చక్కర్లు కొట్టాడు. ద్విచక్రవాహనాన్ని చక్కగా బ్యాలెన్స్​ చేస్తూ.. గ్రామీణ ప్రాంతంలోని ఓ రోడ్డుపై విమానంలా నడిపాడు.

వీడియోను స్పష్టంగా గమనిస్తే.. అందులో ఐదుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు కనిపిస్తుంది.

మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే జీవర్ధన్​ సింగ్​.. సంబంధిత వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

'పెట్రోల్​, డీజిల్​ రేట్లను ప్రభుత్వం ఆకాశానికి ఎత్తుతున్నప్పుడు, ప్రజలు కొత్త జుగాద్​ విమానాన్ని తయారుచేశారు,' అని క్యాప్షన్​ పెట్టారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇదెక్కడి ఐడియారా బాబు అనుకుంటుంటే.. మరికొందరు నవ్వుకుంటున్నారు(Most Funny Video).

అయితే.. ఎవరూ హెల్మెట్​ ధరించలేదు. ఇంకా ఒకే బైక్​పై (Bike viral video) ఇలా ప్రమాదకరంగా, ఇంత మంది వెళ్లడం ట్రాఫిక్​ నిబంధనలకు విరుద్ధమని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

ఇవీ చూడండి: కామాంధుల చెరలో బాల్యం- చర్యలేవి?

మేడపై నుంచి పడి.. రెండు గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారి!

ABOUT THE AUTHOR

...view details