Bike Engine From jeep Bihar: బిహార్‌లోని బేతియాలో లోహా సింగ్ అనే మెకానిక్ బైక్ ఇంజిన్‌తో నాలుగు సీట్ల మినీ క్లాసిక్ జీప్‌ను తయారు చేశాడు. 150 సీసీ ఇంజిన్ ఉన్న ఈ జీప్‌లో నలుగురు కూర్చోవచ్చు. ఒక లీటర్ పెట్రోల్‌తో 30 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 10 క్వింటాళ్ల బరువు గల సరకులను తీసుకెళ్లవచ్చు.
లాక్డౌన్ సమయంలో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించాడు లోహా సింగ్. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు క్లాసిక్ జీప్ తయారు చేయాలనే ఆలోచన అతడికి వచ్చింది. ఈ వాహనాన్ని ఇరుకైన వీధుల్లోనూ నడపగలిగేలా నిర్మించాడు. యూట్యూబ్ సహాయంతో నాలుగు సీట్ల మినీ క్లాసిక్ జీప్‌ను రూపొందించడానికి లోహా సింగ్‌కు 50 రోజులు పట్టింది.
"లాక్డౌన్ సమయంలో ఏ పని లేకుండాఖాళీగా ఉన్నాను. అప్పుడే ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వచ్చింది. సెకండ్ హ్యాండ్ సీబీజీ బైక్ తీసుకొచ్చాం. దాని ఇంజిన్‌ను వేరు చేశాం. ఆ తరువాత టెంపో భాగాలను తీసుకొచ్చాం. అన్నింటినీ కలిపి ఈ క్లాసిక్ జీప్ తయారుచేశాను. ఈ జీప్ లీటర్ పెట్రోల్‌కు 30 కి.మీ మైలేజ్ ఇస్తుంది."
-లోహా సింగ్, మినీ జీప్ రూపకర్త