పదో తరగతి వాళ్లకు గణితం పాఠాలు చెబుతూ ఔరా అనిపిస్తున్నాడు ఓ మూడో తరగతి విద్యార్థి. బిహార్ పట్నా జిల్లా మసౌడీలోని చపౌర్ గ్రామానికి చెందిన 8ఏళ్ల బాబీ రాజ్.. చుట్టుపక్కల ప్రాంతాల్లో 'మ్యాథ్స్ గురూ'గా పేరుగాంచాడు. ఆ గ్రామంలోని విద్యార్థులంతా వచ్చి.. కష్టమైన లెక్కల్ని బాబీ రాజ్‌తో సులువుగా అర్థమయ్యేలా చెప్పించుకుంటున్నారు.
బాబీ రాజ్ తల్లిదండ్రులైన రాజ్ కుమార్, చంద్రప్రభా కుమారి.. 2018లో చపౌర్లో ఓ ప్రైవేటు పాఠశాల తెరిచారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. అయితే.. కరోనా కాలంలో పాఠశాలను చాలాకాలం మూసేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు. గణితంపై బాబీ రాజ్‌కు ఉన్న ఆసక్తిని గమనించిన అతడి తల్లిదండ్రులు.. ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అతడితోనే ట్యూషన్‌కు వచ్చే వారికి పాఠాలు చెప్పించడం మొదలుపెట్టారు.
"నేను చపౌర్లో ఉంటాను. మూడో తరగతి చదువుతున్నాను. టెన్త్ క్లాస్ వాళ్లకూ పాఠాలు చెబుతాను. నేను శాస్త్రవేత్తను కావాలని అనుకుంటున్నాను."
--బాబీ రాజ్