తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మేక రూపురేఖలతో పుట్టిన కుక్కపిల్ల.. చూసేందుకు తరలివస్తున్న జనం

బిహార్​లో ఓ వింత సంఘటన.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ వీధి శునకం మేకను పోలిన కుక్క పిల్లకు జన్మనిచ్చింది. దీన్ని గ్రామస్థులు క్రాస్​ బ్రీడింగ్​గా​ అనుమానిస్తున్నారు. అయితే వైద్యుల మాత్రం మరోలా అంటున్నారు.

pup born to dog resembles goat
మేక రూపరేఖలతో పుట్టిన కుక్కపిల్ల

By

Published : Nov 4, 2022, 8:29 AM IST

Updated : Nov 4, 2022, 9:44 AM IST

మేక రూపురేఖలతో పుట్టిన కుక్కపిల్ల

బిహార్​ గోపాల్​గంజ్​ జిల్లాలో వింత సంఘటన జరిగింది. ఓ కుక్క.. మేక రూపురేఖలు కలిగిన ఓ పిల్లకు జన్మనిచ్చింది. అయితే దాన్ని మేక పిల్లగా భావించి ఓ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లగా.. తన పిల్లను వెతుక్కుంటూ ఆ కుక్క అతడి ఇంటికి వెళ్లింది. కుక్క తన పిల్లను నోటకరచుకుని తన స్థావరానికి తీసుకువెళ్లగా.. అసలు విషయం గ్రామస్థులకు అర్థమైంది. క్రాస్​ బ్రీడింగ్ వల్లే ఇలా జరిగి ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు. వైద్యుల మాత్రం కాదని చెబుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. గోపాల్​గంజ్​ జిల్లాలోని సింధ్​వలియా ప్రాంతంలోని తెగ్రహి గ్రామంలో ఓ వీధి కుక్కు ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఓ కుక్క పిల్ల మాత్రం మేక పోలికలు కలిగి ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాన్ని మేక పిల్లగా భావించిన అదే గ్రామనికి చెందిన శంభు దాస్ అనే వ్యక్తి దాన్ని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అది మేక కాదని తెలియడం వల్ల గ్రామస్థులంతా దాన్ని వింతగా చూస్తున్నారు.

మేక రూపురేఖలతో పుట్టిన కుక్కపిల్ల

'ఓ వీధి కుక్క పెట్టిన పిల్లల్లో ఓ మేక పిల్లను చూశాను. ఆ మేక పిల్ల ఎవరిదని చుట్టు పక్కల అందర్నీ అడగగా.. ఎవరూ సమాధానం చెప్పలేదు. అందువల్ల నేను నా ఇంటికి తీసుకువెళ్లాను. అయితే కొంత సమయానికి ఓ కుక్క వచ్చి.. బుట్టలో దాచిన కుక్క పిల్లను నోటితో పట్టుకుని తన స్థావరానికి తీసుకెళ్లింది' అని శింభు దాస్​ తెలిపాడు.
అయితే దీన్నీ క్రాస్​ బ్రీడింగ్​గా భావించి.. ఆ మేకలాంటి కుక్క పిల్లను శింభు ఇంటి వద్దనే ఉంచి దానికి పాలు అందిస్తున్నారు. దీనిపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సంప్రదించారు. అయితే అక్కడకు చేరుకున్న పశువైద్యులు ఇది క్రాస్​ బ్రీడింగ్​ కాదని తేల్చిచెప్పారు.

వింత కుక్క పిల్లను చూసేందుకు వచ్చిన జనం
కుక్క పిల్లలతో తల్లి

ఇవీ చదవండి:

Last Updated : Nov 4, 2022, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details