తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువతుల మధ్య చిగురించిన ప్రేమ.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే? - బిహార్​లో స్వలింగ సంపర్కుల ప్రేమ జంట

Two Girls love: ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోవట్లేదని పోలీసులను ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించమని పోలీసులను కోరారు. ఇదెక్కడ జరిగిందంటే?

bihar two Girls love
ఇద్దరు యువతుల ప్రేమ

By

Published : May 7, 2022, 12:45 PM IST

Bihar two Girls love: ప్రేమ.. అక్షరాలు రెండే అయినా భావాలు అనంతం. దానికి ఎవరూ అతీతులు కారు. సాధారణంగా ఈ ఫీలింగ్​ ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య పుడుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు అమ్మాయిల మనసుల మధ్య చిగురించింది. అయితే ఆ బంధానికి తల్లిదండ్రులు అడ్డుచెప్పగా.. వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటన బిహార్​లోని పట్నాలో జరిగింది.

అసలేం జరిగిందంటే: తనిష్క్​ శ్రీ అనే యువతిది ఇంద్రపురి. శ్రేయా ఘోష్.. సహస్ర ప్రాంతానికి చెందిన యువతి. ఇద్దరికి గత ఐదేళ్లుగా పరిచయం ఉంది. అది కాస్త ప్రేమగా మారి.. కలిసి జీవించాలనుకున్నారు. ఈ విషయం వారి కుటుంబ సభ్యులు తెలియడం వల్ల తనిష్క్​ను ఆమె కుటుంబ సభ్యులు.. ఇంట్లో నిర్భందించారు. మొబైల్​ ఫోన్​ను లాక్కున్నారు. అక్కడితో ఆగకుండా శ్రేయా ఘోష్​పై నకిలీ కిడ్నాప్ కేసును పెట్టారు. అయితే తాము కలిసి జీవిస్తే కుటుంబసభ్యులు ఒప్పుకోవట్లేదని.. పట్నాలోని మహిళా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది మహిళా ప్రేమ జంట. అక్కడి పోలీసులు కేసు నమోదుకు నిరాకరించడం వల్ల పట్నా ఎస్​ఎస్​పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్వలింగ సంపర్కుల లైంగిక చట్టం ప్రకారం తమకు కలిసి ఉండే హక్కు ఉందని అంటున్నారు. కుటుంబ సభ్యులతో సహా ఎవరికి తమను విడదీసే హక్కు లేదని చెబుతున్నారు.

గతంలో సుప్రీంకోర్టు ఏమందంటే:స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించే సెక్షన్‌ 377ను.. సుప్రీంకోర్టు 2018లో రద్దు చేసింది. ఎల్జీబీటీ(లెస్బియన్‌,గే,బై సెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్లు) హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉందంటూ ఆ వర్గానికి చెందిన పలువురు పోరాటం చేయగా.. చరిత్రాత్మక తీర్పుతో వారికి సాంత్వన కలిగించింది అత్యున్నత న్యాయస్థానం.

ఇదీ చదవండి:సాధారణ ప్రయాణికుడిలా బస్సులో 'సీఎం'.. సౌకర్యాలపై ఆరా!

ABOUT THE AUTHOR

...view details