బిహార్ రాజధాని పాట్నాలోని మోతీహరిలో విద్యాశాఖ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిదంటే..
బిహార్ రాజధాని పాట్నాలోని మోతీహరిలో విద్యాశాఖ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిదంటే..
బిహార్‌లోని ఆదాపూర్‌లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపల్ పోస్టు కోసం శివశంకర్ గిరి అనే వ్యక్తి, రింకీ కుమారి అనే మహిళా ఉపాధ్యాయురాలు మూడు నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పోస్టుకు సీనియరిటీ పరంగా, విద్యార్హతల పరంగా నేనంటే నేను బెటర్ అంటూ ఒకరిపై ఒకరు కారాలుమిరియాలు నూరుకున్నారు. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖ జోక్యం చేసుకొని వీరిద్దరి విద్యార్హతలు తెలిపే ధ్రువపత్రాలను మూడు రోజుల్లో కార్యాలయంలో అందజేయాలని ఆదేశించింది.
అధికారుల ఆదేశాల మేరకు ఇద్దరూ సంబంధిత ధ్రువపత్రాలతో కార్యాలయానికి వెళ్లారు. ఎవరు ముందుగా ఆ పత్రాలను సమర్పించాలనే విషయంలో విద్యాశాఖ కార్యాలయంలోనే వారి మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త ముదిరి ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహానికి గురైన రింకీ కుమారి భర్త మరో ఉపాధ్యాయుడు శివశంకర్ గిరి తలను గట్టిగా పట్టుకున్నాడు. గిరి అతడి నుంచి విడిపించుకొనే ప్రయత్నంలో కింద పడిపోయారు. అయినా అతను వదిలిపెట్టకపోవడంతో అక్కడే ఉన్న కార్యాలయ సిబ్బంది వారిని విడిపించారు. ఈ విషయం గురించి విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా తనకేం తెలియదన్నారు. ఏం జరిగిందనే దానిపై విచారిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి: