తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మార్పు' పవనాల మధ్య కౌంటింగ్​కు బిహార్​ సిద్ధం

'బిహార్'​ ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది. 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 55 కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సవాలుగా మారినప్పటికీ.. తగిన జాగ్రత్తలు చేపట్టింది. మహాకుటమికే బిహార్​ ప్రజలు పగ్గాలు అప్పగించనున్నారన్న ఎగ్జిట్​ పోల్స్​ అంచనాల నేపథ్యంలో దేశం ఈ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

bihar-readies-for-d-day-amid-predictions-of-change
'మార్పు' పవనాల మధ్య కౌంటింగ్​కు బిహార్​ సిద్ధం

By

Published : Nov 9, 2020, 4:22 PM IST

బిహార్​ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశలుగా పోలింగ్​ నిర్వహించగా.. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్​డీఏలోని అనుభవజ్ఞుల నుంచి మహాకూటమి నేతృత్వంలోని యువశక్తికి 'అధికార పీఠం' చేతులు మారుతుందన్న ఎగ్జిట్​ పోల్స్​ అంచనాల నేపథ్యంలో.. దేశప్రజలు బిహార్​ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి...

ఓట్ల లెక్కింపు కోసం 38 జిల్లాల్లో 55 కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. సీఆర్​పీఎఫ్​కు చెందిన 19 కంపెనీలను రంగంలోకి దించింది. స్ట్రాంగ్​ రూమ్​లు, ఓట్ల లెక్కింపు హాళ్ల వద్ద ఈ భద్రతా సిబ్బందిని మోహరించనుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం మరో 59 కంపెనీలను దింపింది. ప్రతి కంపెనీలో 100 మంది సిబ్బంది ఉండనున్నారు. దీనితో పాటు స్థానిక పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అధికారులకు తమ సహకారాన్ని అందించనున్నారు.

ఓ కౌంటింగ్​ కేంద్రం వద్ద

ఇదీ చూడండి:-'మద్య'ధరా సముద్రంలో నితీశ్​ మునక!

అయితే ఇక్కడ చిక్కంతా కరోనాతోనే. వైరస్​ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించింది ఈసీ. కానీ ఓట్ల లెక్కింపు వేళ.. కేంద్రాల వద్ద ఆయా పార్టీల సభ్యులు గుమిగూడకుండా చూసుకోవడం ఇప్పుడు ఈసీ ముందు ఉన్న అతిపెద్ద సవాలు.

ఈ నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టింది ఈసీ. లెక్కింపు కేంద్రాల వద్ద ప్రజలు గుంపుల్లో నిలబడకుండా.. ఇప్పటికే పలు ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది.

ఎగ్జిట్​ పోల్స్​ మాట...

బిహార్​లో గత 15ఏళ్లుగా నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని ఎన్​డీఏ అధికారంలో ఉంది. అయితే ఈసారి ఆర్​జేడీ నేతృత్వంలోని మహాకూటమికే ప్రజలు మొగ్గుచూపుతున్నట్టు అనేక ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్​.. దేశంలో అత్యంత అనుభవజ్ఞులైన రాజకీయ నేతల్లో ఒకరైన నితీశ్​ను ఓడిస్తారని తేల్చిచెబుతున్నాయి. ఈ పరిణామాలు బిహార్​ సమరానికి మరింత ఉత్కంఠను జోడించాయి.

ఏబీపీ సీఓటర్​
టీవీ9
రిపబ్లిక్​ జన్​కీ బాత్​
టైమ్స్​ నౌ సీఓటర్​
టుడేస్​ చాణిక్య

మహాకూటమి గెలిస్తే.. కాంగ్రెస్​, సీపీఐ, సీపీఐ-ఎమ్​, సీపీఐ ఎమ్​ఎల్​ వంటి పార్టీలకు రాజకీయంగా కొంత ఊరట లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:-1,157 మంది నేర చరితుల భవితవ్యం తేలేది రేపే

ప్రముఖుల పోరు...

ఇప్పుడు అందరి చూపు ఆర్​జేడీ యువనేత తేజస్వీ యాదవ్​ పోటీచేస్తున్న రాఘోపుర్​ పైనే. సిట్టింగ్​ స్థానంలో మరోమారు గెలుపు రుచి చూడాలనుకుంటున్నారు తేజస్వీ. ఆయన తల్లిదండ్రులు లాలూప్రసాద్​ యాదవ్​, రబ్రీ దేవీ కూడా గతంలో ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి చేరారు. తేజస్వీ సోదరుడు తేజ్​ప్రతాప్​ యాదవ్​.. హసన్​పుర్​ నుంచి పోటీచేస్తున్నారు.

వీరితో పాటు రాష్ట్ర మంత్రులైన నంద్​ కిషోర్​ యాదవ్​(పట్నా సాహెబ్​), ప్రమోద్​ కుమార్​(మోతిహరి), రాణా రణ్​దిర్​(మధుబన్​), సురేశ్​ శర్మ(ముజఫర్​పుర్​), శర్వణ్​ కుమార్​(నలంద), జై కుమార్​ సింగ్​(దినార), కృష్ణనందన్​ ప్రసాద్​ వర్మ(జెహానాబాద్​) భవితవ్యం మంగళవారం తేలనుంది.

ఇదీ చూడండి:-'భారత్​ మాతా కీ జై' అంటే వారికి ఇష్టం లేదు: మోదీ

ABOUT THE AUTHOR

...view details