తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రెండు గంటల్లోనే ఓటమిని ఒప్పుకొన్న జేడీయూ!' - బిహార్​ ఎన్నికల కౌంటింగ్

సాధారణంగా ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాక పార్టీలు గెలుపోటములపై స్పందిస్తాయి. అయితే ఇందుకు భిన్నంగా బిహార్​ అసెంబ్లీ కౌంటింగ్ మొదలైన రెండు గంటల్లోనే జేడీయూ నేత ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఏమన్నారంటే..?

Bihar polls
రెండు గంటల్లోనే ఓటమిని ఒప్పుకొన్న జేడీయూ!

By

Published : Nov 10, 2020, 10:47 AM IST

Updated : Nov 10, 2020, 10:53 AM IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్డీఏ, మహాకూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. అయితే విచిత్రంగా కౌంటింగ్​ ప్రారంభమైన రెండు గంటల్లోనే జేడీయూ సీనియర్​ నేత ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. కౌంటింగ్​ మొదలైన కాసేపటికి మహాకూటమి ఎక్కువ స్థానాల్లో లీడ్​ ఉంది. ఈ ట్రెండ్​ చూసి జేడీయూ నేత కేసీ త్యాగి ఇలా వ్యాఖ్యానించారు.

"ఏడాది క్రితం ఆర్​జేడీ ఒక్క లోక్​సభ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. లోక్​సభ ఫలితాల ప్రకారం, జేడీయూ దాని మిత్రపక్షాలు 200కు పైగా స్థానాల్లో గెలుపొందాలి. ఎందుకంటే ఏడాదిగా ఆర్​జేడీలో ఎలాంటి మార్పు రాలేదు. నితీశ్​ బ్రాండ్​ పోలేదు. కానీ మేం ఓడిపోవడానికి ఒకే ఒక కారణం కొవిడ్​-19."

- కేసీ త్యాగి, జేడీయూ సీనియర్ నేత

లోక్​జనశక్తి పార్టీ నేత చిరాగ్​ పాసవాన్​ తీరుపై త్యాగి విమర్శలు గుప్పించారు. ఎల్​జేపీ ఈ ఎన్నికల్లో ప్రతికూలంగా వ్యవహరించిందని, బిహార్​ రాజకీయాల్లో అసలు ఆ పార్టీకి స్థానం లేదన్నారు.

Last Updated : Nov 10, 2020, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details