బిహార్ గయాలో 240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎకనమిక్ అఫెన్స్ వింగ్(ఈఓడబ్ల్యూ) అధికారులు. దీని విలువ రూ.3.5 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన అధికారులు.. నిందితుల్లో గయా జిల్లాకు చెందిన ఎక్సైజ్ ట్రైనీ సబ్-ఇన్స్పెక్టర్ సహా ఓ హోంగార్డు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కొన్ని కోట్లు విలువైన గంజాయి.. ఝార్ఖండ్ నుంచి బిహార్‌కు తరలిస్తున్నట్లు తమకు సమచారం అందిందని ఈఓడబ్ల్యూ అదనపు డీజీపీ నాయర్ ఉస్సేన్ ఖాన్ తెలిపారు. దీంతో ఓ బృందంగా ఏర్పడిన పోలీసులు.. గయా జిల్లాలో ఎన్‌హెచ్-2 రహదారిపై గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారని వివరించారు. ఆ వాహనాన్ని వెంబడించి బోధ్ గయాలో పట్టుకున్నారని చెప్పారు.