తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇదేం తీర్పురా బాబు! రేప్ కేసు నిందితుడికి శిక్షగా ఐదు గుంజీలా? - బిహార్​ లేటెస్ట్​ న్యూస్​

ఓ అత్యాచారం కేసులో నిందితుడికి గ్రామ పంచాయితీ పెద్దలు విధించిన శిక్ష అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఏం చేశారంటే!

Five year old girl raped in Nawada
అత్యాచార నిందితుడికి శిక్షగా ఐదు గుంజీలు

By

Published : Nov 24, 2022, 6:29 PM IST

బిహార్​లో ఓ పంచాయితీ పెద్దలు అత్యాచార నిందితుడికి విధించిన శిక్ష.. న్యాయాన్ని అవహేళన చేసేదిగా ఉంది. కొన్నేళ్ల క్రితం ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం జోక్యం చేసుకున్న పంచాయితీ పెద్దలు నిందితుడికి ఐదు గుంజీలను శిక్షగా విధించారు. దీనిపై గ్రామస్థుల్లో అసహనం వ్యక్తమవుతోంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నవాదా ప్రాంతం అక్బర్​పుర్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో.. అరుణ్​ పండిట్​ అనే వ్యక్తి కోళ్లఫారంలో పనిచేసేవాడు. కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారిని ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలు తన ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరగా.. కోళ్లఫారం యజమాని జోక్యం చేసుకుని ఆ విషయాన్ని పంచాయితీలో తేల్చుకుందాం అని సూచించాడు.

ఈ విషయంలో జోక్యం చేసుకున్న గ్రామ పెద్దలు నవంబర్​ 21న తమ తీర్పును వెల్లడించారు. ప్రజలంతా నిందితుడ్ని పోలీసులకు అప్పగిస్తారని అనుకుంటే పెద్దలు అలా చేయలేదు. నిందితుడికి గ్రామస్థులందరి ముందు.. ఐదు గుంజీలను శిక్షగా విధించి, అతడ్ని విడిచి పెట్టారు. ఈ ఐదు గుంజీల తీర్పు పట్ల గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఇంత పెద్ద విషయాన్ని చిన్న శిక్షతో ఎలా సరిపెడతారని, అధికారులు జోక్యం చేసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details