బిహార్ నలంద జిల్లాలో ఓ వృద్ధురాలి దీనస్థితి కంటతడి పెట్టిస్తోంది. ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లోనే తన మనవరాలితో కలిసి నివాసం ఉంటోంది.
కొడుకు మరణంతో..
జిల్లాలోని దిరిపుర్ గ్రామంలో కౌశల్యా దేవి జీవితం సంతోషంగా ఉండేది. కోడలు కొడుకు మనవరాలితో కలిసి ఓ పూరి గుడిసెలో నివసించేది. అకస్మాత్తుగా.. ఉన్న ఇల్లు ఓ రోజు కూలిపోయింది. ఆ ప్రమాదంలోనే కొడుకు, కోడలు మరణించారు. ఇల్లు కూలిపోగా.. మనవరాలితో కలిసి.. గ్రామంలోని మరుగుదొడ్డిలోనే తలదాచుకోవాల్సి వచ్చింది కౌశల్యాదేవికి! ఎండా వాన నుంచి తమను తాము కాపాడుకోవాల్సి వస్తోంది. వృద్ధాప్యం మీదపడగా.. ఎవరూ ఎలాంటి పనిని కూడా ఇవ్వట్లేదు. దీంతో పొట్టనింపుకోవడానికి అందరి ముందు చేయి చాచాల్సిన దుస్థితి వచ్చింది ఆమెకు. అలా యాచిస్తూ.. మనవరాలిని పోషిస్తోంది.
"నా ఇల్లు కూలిపోగా.. దానితో పాటు నా సర్వస్వం కోల్పోయాను. ఈ లోకంలో నా మనవరాలు ఏం చేయగలదు? నేనే యాచిస్తూ ఎలాగోలా వెళ్లదీసుకొస్తున్నాను. వర్షాలు వచ్చినప్పుడు యాచన చేయలేను. నేనైతే ఆకలితో పడుకోగలను. కానీ ఖాళీ కడుపుతో నా మనవరాలును పడుకోపెట్టలేను."