తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హిందుస్థాన్​' పదంపై ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యంతరం

బిహార్​ అసెంబ్లీలో సోమవారం చిన్నపాటి వివాదం చెలరేగింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమంలో.. ఓ ఎంఐఎం శాసనసభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రమాణంలో హిందుస్థాన్​ పదం బదులు భారత్​ ఉండాలని పట్టుబట్టారు.

Bihar MLA from Owaisi s party takes oath in Urdu,but insists word 'Hindustan' be replaced with 'Bharat'
'హిందుస్థాన్​' పదం పై ఓవైసీ పార్టీ ఎమ్మెల్యే అభ్యంతరం

By

Published : Nov 23, 2020, 4:53 PM IST

బిహార్​ అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే వివాదం సృష్టించారు. హిందుస్థాన్ పదంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సోమవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉర్దూలో ప్రమాణం చేయడానికి లేచిన ఆయన.. రాజ్యాంగంలో సూచించిన హిందుస్థాన్​ పదం బదులు భారత్​ ఉండాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే అఖ్తరుల్​ ఇమాన్​.. ఈ డిమాండ్​ లేవనెత్తారు. ఇది ప్రోటెం స్పీకర్​ జీతన్​ రాం మాంఝీకి కాస్త చికాకు తెప్పించింది. చివరకు భారత్​ పదం ఉపయోగించేందుకు ఆయన అంగీకారం తెలిపారు.

దేశప్రజలంతా సాధారణంగా మాట్లాడే హిందుస్థాన్​ పదంపై అభ్యంతరం ఎందుకని విలేకరులు ప్రశ్నించగా.. ఆ పదంతో తనకేం ఇబ్బంది లేదని బదులిచ్చారు ఇమాన్​. 'రాజ్యాంగ ఉపోద్ఘాతంలో ప్రస్తావించిన భారత్​ పదాన్నే.. ఇక్కడా వాడాలని నేను సూచించా.' అని సమాధానమిచ్చారు.

ఎంఐఎం శాసనసభ్యుని వ్యాఖ్యలపై.. అధికార ఎన్డీఏ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు.

హిందుస్థాన్​ అనే పదం సాధారణ పరిభాషలోనిదేని.. కొందరు వేరే పదం ఉపయోగించాలని లేనిపోని వివాదాన్ని సృష్టించాలని చూస్తున్నట్లు జేడీయూ ఎమ్మెల్యే మదన్​ సాహ్మీ ఆరోపించారు. హిందుస్థాన్​ పదం పలకలేని వారు.. పాకిస్థాన్​కు వెళ్లాలని ఎద్దేవా చేశారు భాజపా ఎమ్మెల్యే నీరజ్​ సింగ్​ బబ్లూ.

ఇదీ చూడండి:'బిహార్​ ఎన్నికల్లో 1197 మంది అభ్యర్థులకు నేరచరిత్ర'

ABOUT THE AUTHOR

...view details