తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వధువు కోసం విల్లు విరిచిన వరుడు - ఇతిహాాసాల్లో లాగే వివాహం

బిహార్​లోని సారన్​ జిల్లాలో వినూత్న వివాహం జరిగింది. రామాయణంలో సీతారాముల వలె కల్యాణం చేసుకున్నారు వధూవరులు. వరుడు విల్లును విరిచిన అనంతరం.. వధువు మెడలో వరమాల వేశాడు.

marriage like ramayana
సీతారాముల వివాహం

By

Published : Jun 27, 2021, 7:03 AM IST

సీతారాముల వలె వివాహం చేసుకున్న వధూవరులు

బిహార్​, సారన్​ జిల్లాలోని సాబల్​పుర గ్రామంలో ఓ జంట వినూత్నంగా పెళ్లి చేసుకుంది. ఇతిహాసాల్లోని ఆచారాలు పాటిస్తూ వేడుక చేసుకున్నారు. రామాయణంలో సీతారాముల లాగే వివాహం జరుపుకొన్నారు.

మున్షీ రాయ్​ కూతురు ప్రియాంక కుమారి వివాహం అహ్మద్​పుర్​కు చెందిన ధర్మానాథ్​ రాయ్​ కుమారుడు అర్జున్​ కుమార్​తో నిశ్చయించారు. వేడుకలో ముందుగా వరున్ని బంధువులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అల్పాహారం ముగిసిన అనంతరం ధనస్సు స్వయంవరం ఏర్పాటు చేశారు. వరుడు పెళ్లి మండపం చేరగానే.. రాముడు విల్లుని విరిచిన వృత్తాంతాన్ని పండితులు వివరించారు.

విల్లుని విరచడానికి వెళ్తుండగా.. వరునిపై పూల వర్షం కురిపించారు. అనంతరం వరుడు ధనస్సును చేతపట్టి విల్లుని విరిచాడు. పూల వర్షం కురుస్తుండగా.. వధువు మండపం పైకి వచ్చింది. వరుడు వరమాలను ఆమె మెడలో వేశాడు. రామాయణంలో సీతారాముల కల్యాణంలాగే పెళ్లి తంతు ముగించారు.

కరోనాను పక్కన పెట్టి..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినా.. పెళ్లిలో మాత్రం పేద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. భౌతిక దూరాన్ని పాటించలేదు. ఏ ఒక్కరూ మాస్క్​ ధరించలేదు. ప్రభుత్వ ఆంక్షల ప్రకారం 25 మంది మాత్రమే పాల్గొనాలి.

ఇవీ చదవండి:అనుపమ.. టీచర్ అయ్యింది ఇలా!

ముంబయిని వణికించిన 9వ తరగతి విద్యార్థి!

'ఆయన కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు'

ABOUT THE AUTHOR

...view details