దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ హిట్ అండ్ రన్ కేసు తరహ ఘటన మరోకటి జరిగింది. బిహార్‌లోని మోతిహరిలో ఒక వ్యక్తిని కారు ఢీకొట్టి.. ఆపై 8 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘోర ప్రమాదం కొత్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని 27 నంబర్ జాతీయ రహదారిపై జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం
మోతిహారి నివాసముంటున్న శంకర్ సైకిల్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలోనే గోపాల్‌గంజ్ వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి వచ్చి సైకిల్ని ఢీకొట్టింది. దీంతో శంకర్ ఎగిరిపడి కారు కింద ఉన్న క్యారేజీలో ఇరుక్కుపోయాడు. దీంతో అతడిని కారు 8 కిలోమీటర్ల దూరం లాక్కెల్లింది. ఆ తర్వాత డ్రైవర్ సహా అందులో ఉన్న ప్రయాణికుడు ఇద్దరూ కొత్వాలోని కదమ్ చౌక్ ప్రాంతంలో కారును ఆపి అక్కడి నుంచి పారిపోయారు.