తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈయన తాగుబోతు!'.. 52వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్న ప్రభుత్వం - gopalganj drunkards posters

సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది బిహార్ ప్రభుత్వం. విస్తృత తనిఖీలతో పూర్తిస్థాయి ప్రయోజనం కనిపించక.. వినూత్న ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగానే ఓ జిల్లాలో వేలాది ఇళ్లకు పోస్టర్లు అంటిస్తోంది. ఆ పోస్టర్లలో ఏముందంటే...

bihar liquor ban
'ఈయన తాగుబోతు!'.. 52వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్న ప్రభుత్వం

By

Published : Oct 21, 2022, 6:50 PM IST

"మీరు మద్యం సేవించి తొలిసారి అక్టోబర్ 8న పట్టుబడ్డారు. జరిమానా చెల్లించి, కేసు నుంచి బయటపడ్డారు. కానీ.. రెండోసారి మందు తాగి దొరికితే మాత్రం ఏడాది జైలు శిక్ష తప్పదు. అందుకే మద్యానికి దూరంగా ఉండాలని మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం".. బిహార్ ప్రభుత్వం వార్నింగ్ ఇది. ఇదేదో మందుబాబులు అందరినీ ఉద్దేశించి మీడియా ద్వారా ఇచ్చిన ప్రకటన కాదు. మద్యం తాగి దొరికిన ప్రతి వ్యక్తికి పేరుపేరునా చేస్తున్న హెచ్చరిక. అది కూడా.. వారి ఇళ్లకు పోస్టర్ అంటించి మరీ!

'ఈయన తాగుబోతు!'.. 52వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్న ప్రభుత్వం

ప్రస్తుతం బిహార్​ గోపాల్​గంజ్​ జిల్లాలోని అబ్కారీ శాఖ అధికారులు, సిబ్బంది అంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. పదులు కాదు.. వందలు కాదు.. ఏకంగా 52వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్నారు. నీతీశ్ కుమార్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో భాగంగా ఇలా చేస్తున్నారు. 2022 ఏప్రిల్​ నుంచి జిల్లాలో ఇప్పటివరకు తొలిసారి మద్యం సేవించి దొరికిన వారందరి ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్నారు.

"మద్యం మత్తులో ఎవరైనా తొలిసారి దొరికితే.. వార్నింగ్ ఇచ్చి పంపుతున్నాం. కానీ రెండోసారి పట్టుబడితే వారు తప్పించుకోలేరు. ఏడాది జైలు శిక్ష పడుతుంది. ఇంతకుముందు మందు తాగి తొలిసారి దొరికిన వారు జరిమానాతో తప్పించుకునేవారు. ఆ సంగతి చుట్టుపక్కల వాళ్లు, బంధువులకు తెలిసేది కాదు. అందుకే 2022 ఏప్రిల్​ నుంచి దొరికిన వాళ్ల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్నాం. అలా చేస్తే ఆ వ్యక్తి తాగుతున్నారని అందరికీ తెలుస్తుంది." అంటూ తమ ప్రయోగం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు అబ్కారీ శాఖ అధికారి రాకేశ్ కుమార్.

'ఈయన తాగుబోతు!'.. 52వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్న ప్రభుత్వం
'ఈయన తాగుబోతు!'.. 52వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్న ప్రభుత్వం
'ఈయన తాగుబోతు!'.. 52వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్న ప్రభుత్వం

రాష్ట్రంలో మద్య నిషేధాన్ని 2016లో అమలు చేసింది బిహార్​ ప్రభుత్వం. మద్యం తయారీ, విక్రయం, సేవించటం నేరం. తొలినాళ్లలో నేరానికి పాల్పడితే ఆస్తుల స్వాధీనం, జీవిత ఖైదు శిక్షలు ఖరారు చేశారు. అయితే, 2018లో లిక్కర్​ బ్యాన్​ చట్టానికి సవరణలు చేశారు. శిక్షల్లో ఉపశమనం కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details