కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పేదరికంలోకి జారుకున్నారు. భారత్‌లోనూ ఈ పరిస్థితి మరింత దిగజారిందని నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచీ(ఎంపీఐ)(multidimensional poverty index 2021) చెబుతోంది. 2015-16లో చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా తొలిసారి రాష్ట్రాల వారీగా పేదరిక సూచీని(niti aayog report on poverty) విడుదల చేసింది నీతి ఆయోగ్. ఈ సూచీ ప్రకారం(POVERTY INDEX).. దేశంలో అత్యంత పేద రాష్ట్రంగా బిహార్ నిలవగా.. ఆ తర్వాత ఝార్ఘండ్, ఉత్తర్‌ప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
బిహార్‌లో 51.91 శాతం, ఝార్ఖండ్‌లో 42.16శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 37.79 శాతం, మధ్యప్రదేశ్‌లో 36.65, మేఘాలయలో 32.67శాతం మంది పేదరికంలోకి జారుకున్నారు.
చివరిస్థానంలో కేరళ..
పేదవారు అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ(0.71 శాతం) సూచీలో చివరిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత గోవా(3.76శాతం), సిక్కిం(3.82శాతం), తమిళనాడు(4.89శాతం), పంజాబ్(5.59శాతం) ఉన్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్..
నీతి ఆయోగ్ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచీ(multidimensional poverty index india) ప్రకారం తెలంగాణలో 13.74 శాతం మంది పేదవారు ఉన్నారు. రాష్ట్రాల వారీగా 18వ స్థానంలో నిలిచింది. మరోవైపు.. తెలంగాణతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ కాస్త మెరుగైన స్థానంలో ఉంది. 12.31 శాతం మందితో సూచీలో 20వ స్థానంలో నిలిచింది.
నీతి ఆయోగ్ రూపొందించిన పేదరిక సూచీ 12 అంశాల ఆధారంగా..
ప్రపంచవ్యాప్తంగా అనుసరించే.. ఆక్స్ఫర్డ్ పావర్టీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్(ఓపీహెచ్ఐ), ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్డీపీ) పద్ధతులను ఉపయోగించి భారత జాతీయ ఎంపీఐని(POVERTY INDEX) రూపొందించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన విధానం వంటి మూడు కీలక అంశాలను బేరీజు వేసినట్లు తెలిపింది. అందులో పోషకాహారం, పిల్లలు, పెద్దవారి మరణాలు, పాఠశాల హాజరు, వంట గ్యాస్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, పక్కా ఇళ్లు, బ్యాంకు ఖాతాలు వంటి 12 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
కేంద్రపాలిత ప్రాంతాల్లో..
కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రనగర్ హవేలీ అత్యధికంగా 27.36 శాతంతో పేదరికంలో(POVERTY INDEX) తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో 12.58 శాతం, దామన్ దియూలో 6.82 శాతం, ఛండీగఢ్‌లో 5,97శాతం, దిల్లీలో 4.79శాతం, అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో 4.30శాతం, లక్షాదీప్లో 1.82శాతం, పుదుచ్చేరిలో 1.72శాతం మంది పేదరికంలో ఉన్నారు.
ఇదీ చూడండి:'రాజ్యాంగ బలంతోనే అభివృద్ధి పథంలో దేశం'