Labourers Died: బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. పట్నా రాంపుర్ దియరా ఘాట్ వద్ద ఓ పడవలో మంటలు చెలరేగాయి. సోన్ నదిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. బోటులోని డీజిల్ డబ్బాల సమీపంలో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఆ పడవలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.
గ్యాస్ సిలిండర్ లీకై ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. అయితే.. పడవలో సిలిండర్ తీసుకెళ్లడం నిషేధం.
పడవలో చెలరేగిన మంటలు.. ఐదుగురు కూలీలు దుర్మరణం - బిహార్ వార్తలు
Bihar Five labourers died when a fire broke out in their boat
14:58 August 06
పడవలో చెలరేగిన మంటలు.. ఐదుగురు కూలీలు దుర్మరణం
Last Updated : Aug 6, 2022, 5:58 PM IST