తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీఐపీ మందుబాబుల కోసం సర్కారీ గెస్ట్ హౌస్​లు.. ఏసీలు, బెడ్​లు.. కాపలాకు కుక్క కూడా.. - బిహార్ సమస్తిపుర్​ లేటెస్ట్ న్యూస్

మద్యం తాగి.. రోడ్లపై ఎటు పోలేని స్థితిలో ఉన్న బడాబాబుల సౌకర్యార్థం.. ప్రత్యేక సౌకర్యాలతో కూడిన వార్డులను సిద్ధం చేసింది బిహార్ సర్కారు. వారికి సపర్యలు చేసేందుకు ఈ మేరకు ఏర్పాట్లు చేసింది.

Bihar excise department
విఐపీ వార్డు

By

Published : Oct 9, 2022, 10:52 PM IST

రోడ్లపై మద్యం తాగి ఎటు పోలేని స్థితిలో ఉన్న బడాబాబుల సౌకర్యార్థం.. బిహార్‌ అబ్కారీ శాఖ ప్రత్యేక వసతులు కల్పిస్తోంది. వారి కోసం ఏకంగా ప్రత్యేక సౌకర్యాలతో కూడిన వార్డులను సిద్ధం చేసింది. రోడ్లపై తాగి తిరిగే వారిని అతిథుల మాదిరిగా సపర్యలు చేయడానికి సమస్తిపుర్‌ అబ్కారీశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

మద్యం తాగి ఎటుపోలేని వీఐపీల కోసం ఏర్పాటు చేసిన బెడ్లు
.

ప్రభుత్వ ఉద్యోగులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు రోడ్లపై తాగి ఎక్కడపడితే అక్కడ తిరగకుండా.. వార్డులోనే మద్యం మత్తు దిగేదాకా ఉండొచ్చని సర్కారు సూచించింది. వారి కోసం 24 గంటల పాటు బెడ్లు, దుప్పట్లతో పాటు ఏసీలను ఏర్పాట్లు చేయడమే కాకుండా వారిని కాపలా కాయడానికి ఓ శునకాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు.

.
.

ABOUT THE AUTHOR

...view details