తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజలకు సేవ చేయడం ఎలాగో భాజపాకు తెలుసు' - బిహార్​ ఎన్నికలు 2020

దిల్లీలో భాజపా 'బిహార్' ​విజయోత్సవ వేడుక
దిల్లీలో భాజపా 'బిహార్' ​విజయోత్సవ వేడుక

By

Published : Nov 11, 2020, 6:53 PM IST

Updated : Nov 11, 2020, 8:03 PM IST

20:02 November 11

  • 'సబ్‌కా సాత్‌ - సబ్‌కా వికాస్‌ - సబ్‌కా విశ్వాస్‌' వల్లే ఎన్నికల్లో విజయం సాధించాం: ప్రధాని మోదీ
  • ఇటీవల సైలెంట్‌ ఓటర్ల గురించి తరచూ వార్తల్లో వింటున్నాం: ప్రధాని
  • మహిళా ఓటర్లు.. భాజపాకు అతిపెద్ద సైలెంట్‌ ఓటర్లుగా మారారు: ప్రధాని
  • భారత మహిళల జీవన ప్రమాణాల మెరుగుకు భాజపా కృషిచేసింది: ప్రధాని
  • కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అనేక అభివృద్ధి పనులు చేపట్టాం: ప్రధాని
  • ఆత్మనిర్భర్‌ భారత్‌ సంకల్పాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాం: ప్రధాని

19:47 November 11

అది భాజపాకు తెలుసు...

  • భాజపా ప్రజల హృదయాలను గెలుచుకుంది: ప్రధాని మోదీ
  • ప్రజలకు సేవ చేయడం ఎలాగో భాజపాకు తెలుసు: ప్రధాని మోదీ
  • దేశ నలుమూలలకూ భాజపా చేరిపోయింది: ప్రధాని మోదీ
  • దేశ వికాసం కోసం శ్రమిస్తున్నందునే భాజపా వైపు ప్రజలు నిలిచారు: ప్రధాని
  • దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించారు: ప్రధాని మోదీ
  • పేదలు, బడుగు, బలహీనవర్గాల పక్షాన నిలిచిన పార్టీ.. భాజపా: ప్రధాని

19:43 November 11

భాజపా జెండా రెపరెపలు...

  • బిహార్‌ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు: ప్రధాని
  • గుజరాత్‌, యూపీ, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇచ్చారు: ప్రధాని
  • కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లోనూ ప్రజలు భాజపాకే పట్టం కట్టారు: ప్రధాని

19:36 November 11

ప్రజలకు మోదీ ధన్యవాదాలు..

  • భాజపాకు భారీ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
  • ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది: ప్రధాని
  • భారత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారు: ప్రధాని మోదీ
  • బిహార్‌లో గతంలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగాయి: ప్రధాని
  • ఈసారి ఎన్నికల్లో పెద్దఎత్తున తరలివచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు: ప్రధాని
  • కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సాధారణ విషయం కాదు: ప్రధాని
  • కొవిడ్‌.. మానవాళికి అతిపెద్ద సవాల్‌ విసిరింది: ప్రధాని మోదీ
    కొవిడ్‌ సవాల్‌ను అధిగమించి ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు: ప్రధాని

19:23 November 11

మోదీకి సత్కారం...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధ్వజమాలతో సత్కరించారు భాజపా అగ్రనేతలు. అనంతరం ప్రజలకు 'విక్టరీ' అభివాదం చేశారు.

19:14 November 11

భాజపా కార్యాలయంలో మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దిల్లీ భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. 'బిహార్'​ విజయోత్సవ వేడుకలో మోదీ పాల్గొననున్నారు.

18:57 November 11

'బిహార్'​ జోష్​

బిహార్​ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి విజయం సాధించడం సహా భాజపాకు భారీగా సీట్లు రావడంపై కమలదళం ఆనందంలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ వేడుకను ఏర్పాటు చేశారు భాజపా శ్రేణులు. వేడుక ప్రాంగణానికి ఇప్పటికే కేంద్రమంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్​, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్ది సేపట్లో భాజపా కార్యాలయానికి చేరుకోనున్నారు.

16:46 November 11

లైవ్​: భాజపా కేంద్ర కార్యాలయంలో 'బిహార్' ​విజయోత్సవం

దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో బిహార్ ఎన్నికల ​విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి. 

Last Updated : Nov 11, 2020, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details