Dream11: ఆన్లైన్ బెట్టింగ్ వేదిక డ్రీమ్11లో రూ.2 కోట్లు గెలిచి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు బిహార్‌కు చెందిన ఓ డ్రైవర్. శారన్ జిలాల్లోని రసూల్పుర్కు చెందిన డ్రైవర్ రమేశ్ కుమార్‌ను ఈ అదృష్టం వరించింది. దీంతో అతడి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.
"ఆరంభంలో నేను రూ.49 పెట్టి ఆడేవాడిని. కొన్నిసార్లు గెలిచేవాడిని. మరికొన్ని సార్లు నిరాశే ఎదురయ్యేది. ఇటీవలే పంజాబ్, లఖ్‌నవూ మధ్య మ్యాచ్‌లో పంజాబ్‌ను ఎంచుకున్నా. రూ.59కి కెప్టెన్‌గా కగిసో రబాడా, వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను ఎంచుకున్నా."
-రమేశ్ కుమార్, డ్రైవర్
అదృష్టం కొద్దీ ఆ మ్యాచ్‌లో రబాడా 3 వికెట్లు తీశాడు. అతడు ఎంపిక చేసుకున్న ఇతర క్రికెటర్లు కూడా బాగా ఆడటం వల్ల దేశ స్థాయిలో అతడికి మంచి పాయింట్లు లభించాయి. మ్యాచ్ జరిగిన తెల్లారి అతడు నెం.1 స్థానంలో నిలిచి, రూ.2కోట్లు గెలుచుకున్నట్లు అతడికి సందేశం వచ్చింది. జీఎస్టీ చెల్లింపుల అనంతరం అతడి ఖాతాలో రూ.1.4కోట్లు వచ్చి చేరాయి.
రమేశ్ కుమార్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చివేసే సొమ్ము ఇది. అతడి తండ్రి రోజూ కూలీగా పనిచేస్తున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడాన్ని రమేశ్ నమ్మలేకపోతున్నారు. ఈ డబ్బుని తన పిల్లల చదువులకు, సమాజ శ్రేయస్సు కోసం వాడతానని అన్నారు.
ఇదీ చూడండి:కట్టుబట్టలతో దేశం దాటిన అభాగ్యుడికి రూ.2కోట్ల లాటరీ.. అయినా బ్యాడ్ లక్!