తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరెంట్​ కోతలు.. 'మొబైల్​' వెలుగులోనే చికిత్సలు.. ఎమర్జెన్సీ అయితే ఇక అంతే! - Power Cuts At Hospital mobile lights

Power Cuts At Hospital: విద్యుత్​ సరఫరాలో అంతరాయం వల్ల బిహార్​ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మొబైల్​ లైట్ల​ వెలుగుల మధ్య చికిత్స అందిస్తున్నారు. కరెంటు కోతలతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Power Cuts At Hospita
Power Cuts At Hospita

By

Published : Jun 4, 2022, 1:01 PM IST

Updated : Jun 4, 2022, 1:16 PM IST

Power Cuts At Hospital: బిహార్​ ససారం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల.. సెల్‌ఫోన్‌ లైట్ల మధ్యే రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమర్జెన్సీ వార్డులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రోగులకు వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయి. ఉక్కపోత భరించలేక.. దోమల బాధ తట్టుకోలేక రోగులతో పాటు సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొబైల్​ లైట్ల వెలుగులోనే చికిత్స
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు
కొన్ని సమస్యల కారణంగా ఆసుపత్రిలో తరచూ కరెంటు కోతలు ఏర్పడుతున్నాయని వైద్యుడు బ్రిజేశ్​ కుమార్​ తెలిపారు. ఇలాంటి పరిస్థితులను గత కొద్దిరోజులుగా ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు.
Last Updated : Jun 4, 2022, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details