భీకర వర్షాలు బిహార్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. దర్భంగా జిల్లాలో కమలా, కోసి, బాగమతి, అధ్వారా నదులు ఉప్పొంగుతుండగా.. ఆ జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల ప్రభావంతో.. అనేక గ్రామాలు జలమయమయ్యాయి. శ్మశానవాటికల్లో నీరు చేరడం వల్ల.. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
వెదురు బొంగులతో..
మహిసౌత్ గ్రామంలో 90 ఏళ్ల సినోయ్ యాదవ్ సోమవారం మృతి చెందాడు. అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుడి బంధువులు నానా ఇక్కట్లు పడ్డారు. నీళ్లతో నిండిపోయిన శ్మశానవాటికలోనే.. వెదురు కర్రలతోనే ఒక వంతెనలాంటిది నిర్మించి, దానిపై ఓ సిమెంటు తొట్టిని ఏర్పాటు చేశారు. అందులో కర్రలు నింపి మృతదేహాన్ని దహనం చేశారు.