తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పెగసస్‌'పై దర్యాప్తు జరపండి: నితీశ్‌ - పెగసస్ హ్యాకింగ్ తాజా

పెగసస్ హ్యాకింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ కోరారు. ప్రజల్ని వేధించేందుకు ఇలాంటి పనులు చేయకూడదని వ్యాఖ్యానించారు.

nitish kumar on pegasus
నితీశ్​ కుమార్​

By

Published : Aug 3, 2021, 4:52 AM IST

పెగసస్ హ్యాకింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని విపక్ష పార్టీలు పట్టుపడుతుండగా.. వాటికి భాజపా మిత్రపక్షం జత కలిసింది. పెగసస్‌పై అన్ని విషయాలు బయటపెట్టాలని తాజాగా జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ కోరారు. ప్రజలను వేధించేందుకు ఇలాంటివి చేయకూడదని వ్యాఖ్యానించారు.

"ఫోన్ల ట్యాపింగ్‌పై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. దీన్ని పార్లమెంట్‌లో కూడా లేవనెత్తారు. మీడియాలో అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల్ని వేధించేందుకు ఇలాంటి పనులు చేయకూడదు. అందుకే ఈ అంశాన్ని కచ్చితంగా పరిశీలించాలి. అన్ని వివరాలు బహిర్గతం చేయాల్సి ఉంది"

-నితీశ్‌ కుమార్​, బిహార్ సీఎం

కొద్దిరోజులుగా పార్లమెంట్‌ పెగసస్ వ్యవహారంతో దద్దరిల్లుతోంది. పెగసస్‌పై దర్యాప్తునకు విపక్షాలు పట్టుపట్టడం వల్ల ఉభయ సభల్లో తరచూ వాయిదా పడుతున్నాయి. ఇదిలా ఉండగా.. దీనిపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ వారంలో విచారణ జరగనుంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details