Nitish Kumar Rahul Gandhi : బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి నేతలిద్దరూ చర్చించుకున్నారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే అంశంపై సమాలోచనలు చేశారు. నీతీశ్, రాహుల్ గాంధీ దాదాపు గంటపాటు చర్చించుకున్నారు. బిహార్ జలవనరుల శాఖ మంత్రి మనోజ్ కుమార్ ఝా కూడా నీతీశ్ వెంట ఉన్నారు.
జనతా దళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్డీ కుమార స్వామిని కూడా కలిశారు నీతీశ్.
అయితే ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న తర్వాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని నీతీశ్ కలవడం ఇదే మొదటి సారి. సోమవారం.. దిల్లీ చేరుకున్న నీతీశ్, ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఐఎన్ఎల్డీ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలాను కూడా కలవనున్నారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలన్నిటినీ ఏకం చేసే పనిలో నీతీశ్ కుమార్ నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే వివిధ పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.