బిహార్, కటిహార్ జిల్లాలో అద్భుతం జరిగింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆరు అడుగుల లోతు మట్టిలో కూరుకుపోయిన బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. గ్రామస్థులంతా కలిసి పిల్లాడిపై పేరుకుపోయిన మట్టి దిబ్బలను తీసి రక్షించారు.
ఇదీ జరిగింది..

జిల్లాలోని ఫర్సదాంగి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మట్టి కోసం పెద్ద మొత్తంలో గుంతలను తవ్వారు. చుట్టుపక్కల పిల్లలు ఆ గుంతల్లో ఆడుకుంటున్నారు. ఆ క్రమంలో హఠాత్తుగా మట్టిదిబ్బలు కూలి.. ఓ పిల్లాడిపై పడిపోయాయి. దాదాపు ఆరు అడుగుల లోతులో పిల్లాడు కూరుకుపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఘటనా స్థలానికి వచ్చి.. వేగంగా మట్టి దిబ్బలను తొలగించారు. పిల్లాడిని రక్షించారు. అంత సమయం గడిచినా పిల్లాడు సురక్షితంగా బయటపడ్డాడు. అతడ్ని స్థానిక రైతు గుజర్ రాయ్ కుమారుడు విజయ్‌గా గుర్తించారు. బాలుడు సురక్షితంగా బయటపడటం పట్ల గ్రామస్థులంతా అనందం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి:మాజీ భార్యే సవతి తల్లి అయిందని తెలిస్తే...