తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫ్రీగా కరోనా టీకా- బిహార్​ కేబినెట్​ నిర్ణయం - COVID-19 vaccination

ఉచిత టీకా పంపిణీకి నితీశ్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో ఆ రాష్ట్రంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్​ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

Bihar cabinet gives its nod to free COVID-19 vaccination
కొవిడ్​ ఉచిత టీకా పంపిణీకి బిహార్​ క్యాబినెట్​ ఆమోదం

By

Published : Dec 16, 2020, 5:51 AM IST

టీకాల లభ్యత ఆధారంగా బిహార్​ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్​ను పంపిణీ చేసేందుకు నితీశ్​ సర్కార్​ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల మ్యానిఫెస్టో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రంలో ఉచిత కరోనా వ్యాక్సిన్‌ను భాజపా అందిస్తుందని మాటిచ్చారు. భాజపా సహకారంతో మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నితీశ్.. మొదటి కేబినెట్​ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల వేళ కరోనా టీకాను ఉచితంగా అందిస్తామని హామీలు ఇవ్వడంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరిగింది. ఓటు వేస్తేనే టీకా ఇస్తారా? అంటూ భాజపాపై విపక్షాలు మండిపడ్డాయి. ఇటీవల కేరళలోనూ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని ఆ రాష్ట ముఖ్యమంత్రి పినరయ విజయన్ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వాగ్దానమే చేశారు.

ABOUT THE AUTHOR

...view details