డ్రీమ్ 11.. ఓ ఆటో డ్రైవర్ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే అతడ్ని కోటీశ్వరుడ్ని చేసింది. 39 రూపాయలు పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు సంపాదించి పెట్టింది. బిహార్‌కు చెందిన నౌషాద్ అన్సారీ అనే వ్యక్తికి ఈ బంఫర్ ఆఫర్ తగిలింది. ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ కూడా తెరవని నౌషాద్ అన్సారీకి.. బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కారణంగా కోటి రూపాయల రివార్డ్ లభించింది.
జీవితాన్ని మార్చిన పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్..
నౌషాద్ అన్సారీ.. ఒక ఆటో డ్రైవర్. పూర్ణియ జిల్లా దగ్రువా బ్లాక్‌లోని మజ్‌గామా పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్నాడు. బుధవారం జరిగిన పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు అతడు టీం సెట్ చేశాడు. ఆ టీం డ్రీమ్ 11 అందరికంటే ఎక్కువ పాయింట్లు సంపాదించింది. దీంతో అతడికి కోటి రూపాయల రివార్డ్ లభించింది.
"2021 నుంచి నేను డ్రీమ్ 11లో టీం సెట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు 45 టీంలు సెట్ చేశాను. పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు.. 39 రూపాయలతో టీం సెట్ చేశాను. లక్కీగా నాకు కోటి రూపాయల రివార్డ్ వచ్చింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆటో నడిపితే రోజుకు కేవలం నాలుగు వందలు మాత్రమే వచ్చేవి. ఒకేసారి ఇన్ని డబ్బులు రావడం.. నాకు ఆశ్చర్యంగా ఉంది."