బిహార్ రాజధాని పట్నా జిల్లాలో విషాదం జరిగింది. పీపాపుల్ వద్ద గంగానదిలోకి వ్యాను దూసుకువెళ్లిన ప్రమాదంలో 9మంది జల సమాధి అయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు జీపులో 13మంది ఉండగా, నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.
గంగా నదిలోకి దూసుకెళ్లిన వ్యాను- 9మంది జలసమాధి - Jeep fell into Ganga river
11:36 April 23
9మంది జలసమాధి
దేశమంతా కరోనాతో అల్లాడుతున్న వేళ.. బిహార్‌లో ఘోరం ప్రమాదం జరిగింది. పట్నా జిల్లా పిపాపుల్ వద్ద పాంటూన్ వంతెన పైనుంచి వ్యాను గంగానదిలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందారు.
ప్రమాద సమయంలో వ్యానులో 13 మంది ఉన్నారు. నలుగురు నదిలో ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరగా.. మిగతావారు ప్రాణాలు కోల్పోయారు. అఖీపుర్‌లో వివాహానికి హాజరైన ఓ కుటుంబం.. చిత్రకూట్‌లోని తమ స్వస్థలానికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వ్యాను డ్రైవర్.. అతివేగంగా నడిపి నియంత్రణ కోల్పోవటం వల్లనే ప్రమాదం జరిగినట్లు పట్నా జిల్లా మెజిస్ట్రేట్ ప్రకటించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ బృందం, స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. గల్లంతైనవారి కోసం గాలింపు చేపట్టారు. 9మంది మృతదేహాలను సహాయ బృందాలు నది నుంచి బయటికి తీశాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి పట్నా జిల్లా మెజిస్ట్రేట్ 4లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.