తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిగ్ బీ ఇంటి గోడ కూల్చేందుకు మహా ఉద్యమం! - రోడ్డు విస్తరణ అమితాబ్ ఇంటి కూల్చివేత

ముంబయి జుహూలోని అమితాబ్ బచ్చన్ ఇంటి ముందు వినూత్న బ్యానర్లు కనిపిస్తున్నాయి. ఓ విషయంపై నిరసన తెలిపేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు వీటిని కట్టారు. ఎందుకంటారా..?

amitab msn members
అమితాబ్ బచ్చన్ ఇంటి వివాదం

By

Published : Jul 15, 2021, 4:59 PM IST

'బిగ్​ బీ... పెద్ద మనసు చేసుకోండి' అంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు అమితాబ్ బచ్చన్ ఇంటి మందు బ్యానర్లు కట్టారు. ముంబయి జుహూలోని అమితాబ్ ఇంటి ముందు వీటిని ఏర్పాటు చేశారు.

బిగ్ బీ ఇంటి ముందు ఫ్లెక్సీ

రోడ్డు విస్తరణ కోసం తన ఇంటి కాంపౌండ్ గోడను కూల్చేందుకు అమితాబ్ సహకరించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న కార్యకర్తలు

"బిగ్​ బీని పెద్ద మనసు చేసుకోవాలని మేం కోరుతున్నాం. విస్తరణ కోసం రోడ్డు హద్దులను గుర్తించేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సివిల్ సర్వే అధికారులు మాతో చెప్పారు. సమస్య ఎనిమిది రోజుల్లో పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. దీనిపై ఎలాంటి పురోగతి లేకుంటే మా నిరసనను ఉద్ధృతం చేస్తాం."

-నవ నిర్మాణ సేన కార్యకర్త

రోడ్డు విస్తరణ కోసం అమితాబ్ ఇంటిలోని ఓ భాగాన్ని కూల్చే విషయంపై 2017లోనే ఆయనకు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నోటీసులు జారీ చేసింది. అయితే దీనికి అమితాబ్ ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం ఆ నోటీసులపైనే బీఎసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రోడ్డు విస్తరణ కోసం ఎంతమేరకు ఇంటిని కూల్చాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:జనావాసాల్లోకి మొసలి- పట్టుకుని, ఆటో ఎక్కించి...

ABOUT THE AUTHOR

...view details