తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమారుడి మందుల కోసం సైకిల్​పై 300 కిమీ.. - సైకిల్​ యాత్ర

కుమారుడికి అవసరమైన ఔషధాలు తీసుకొచ్చేందుకు ఓ తండ్రి పెద్ద సాహసమే చేశాడు. లాక్​డౌన్​తో ఎలాంటి సౌకర్యాలు లేకపోవటం వల్ల పాత సైకిల్​పై 300 కిమీ ప్రయాణించాడు. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను అనుకున్నది సాధించాడు. ఈ సంఘటన కర్ణాటక మైసూర్​ జిల్లాలో జరిగింది.

Father rides bicycle for 300km
సైకిల్​పై తండ్రి సాహసం

By

Published : May 31, 2021, 5:21 PM IST

కన్నబిడ్డల కోసం ఎంతటి సాహసమైనా చేసేందుకు వెనుకాడరు తల్లిదండ్రులు. అలాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. కుమారుడికి అవసరమైన ఔషధాలను తీసుకొచ్చేందుకు ఓ తండ్రి పాత సైకిల్​పై 300 కిలోమీటర్లు ప్రయాణించి పెద్ద సాహసమే చేశాడు. ఎన్ని అడ్డంకులొచ్చినా.. మందులు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు.

సైకిల్​పై వెళ్తోన్న ఆనంద్​

తండ్రి సైకిల్​ సాహసం..

మైసూర్​ జిల్లా టి.నరసిపురా తాలూకాలోని కొప్పలు గ్రామానికి చెందిన ఆనంద్​(45) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భైరాశ్​ అనే కుమారుడు ఉన్నాడు. చిన్నారికి అరుదైన వ్యాధి సోకటం వల్ల గత 10 సంవత్సరాల నుంచి బెంగళూరులోని నిమ్​హాన్స్​ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మందులు కొనసాగిస్తేనే.. అతని ఆరోగ్యం స్థిమితంగా ఉంటుంది. ఒక్క రోజు లేకపోయినా సమస్య తలెత్తుతుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి బెంగళూరు వెళ్లి ఔషధాలు తీసుకొస్తాడు ఆనంద్​.

అయితే.. కొవిడ్​ ఉద్ధృతితో రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించటం వల్ల బెంగళూరు వెళ్లేందుకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా పోయాయి. బంధువులు, స్నేహితులను అడిగినా వైరస్​ భయంతో ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు.

కుటుంబ సభ్యులతో ఆనంద్​

తానే స్వయంగా వెళ్లి ఔషధాలు తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు ఆనంద్​. తన వద్ద ఉన్న పాత సైకిల్​పై మే 23న ప్రయాణం మొదలు పెట్టాడు. మార్గమధ్యలో పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు కూడా తిన్నాడు. అవాంతరాలను దాటి 25న బెంగళూరు చేరుకున్నాడు. అతని సాహసం చూసి ఆసుపత్రి వైద్యులే ఆశ్చర్య పోయారు. మందులు ఇచ్చి క్షేమంగా ఇంటికి వెళ్లమని చెప్పారు. అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణం మొదలు పెట్టిన ఆనంద్​... 26న సాయంత్రం ఇల్లు చేరాడు.

తన కొడుకును చూడగానే.. తాను పడ్డ కష్టం మొత్తం మర్చిపోయానని చెప్పాడు ఆనంద్​.

ఇదీ చూడండి:హై రిస్క్​ కోటాలో 'సెక్స్​ వర్కర్ల'కు టీకా!

ABOUT THE AUTHOR

...view details