BIDAR NARSIMHA TEMPLE: కర్ణాటక, బీదర్ సమీపంలోని మణిచోళ పర్వత శ్రేణుల్లోని గుహలో ఉన్న నరసింహస్వామి ఆలయం నాలుగేళ్ల తర్వాత తెరుచుకుంది. ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే 300 మీటర్ల మేర సొరంగంలో పీకల్లోతు నీళ్లలో వెళ్లాల్సి ఉంటుంది. సొరంగంలో నీరు ఎక్కువవడం వల్ల నాలుగేళ్ల క్రితం ఆలయాన్ని మూసివేశారు ఆధికారులు.
ఈ ఆలయం ఎక్కడుంది?
బీదర్ నగరం నుంచి 4.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణిచోళ కొండ శ్రేణి క్రింద 300 మీటర్ల సొరంగంలో ఈ పురాతన ఆలయం ఉంది. నీరు ఎల్లప్పుడూ ఈ సొరంగం గుండా ప్రవహిస్తుంది. నరసింహుని దర్శనం కోసం భక్తులు నీటిలో నడుచుకుంటూ వెళ్తారు.