- 48రోజులుగా చంద్రబాబును నిర్బంధించారు: ఎమ్మెల్సీ అనురాధ
- తప్పుడు ఆరోపణలతో చంద్రబాబును నిర్బంధించారు: అనురాధ
- ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును అరెస్టు చేశారు: భువనేశ్వరి
- ఆలస్యమైనా న్యాయమే గెలుస్తోంది: భువనేశ్వరి
- మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పవన్‌కల్యాణ్ ఆవేదన చెందేవారు
- పవన్, తెదేపా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి: భువనేశ్వరి
Live Updates: నా తండ్రి ఎన్టీఆర్ నుంచి పౌరుషం.. చంద్రబాబు నుంచి ఓర్పు నేర్చుకున్నాను: నారా భువనేశ్వరి - tdp programs against chandrababu arrest
Published : Oct 26, 2023, 9:14 AM IST
|Updated : Oct 26, 2023, 5:59 PM IST
17:50 October 26
ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును అరెస్టు చేశారు: భువనేశ్వరి
17:38 October 26
ప్రజల నుంచి దూరం చేయాలని చంద్రబాబుపై కేసులు పెట్టారు
- లోకేష్, చంద్రబాబుకు వస్తున్న ప్రజాస్పందన చూసి వైకాపా నేతలు భయపడ్డారు
- ఎన్నికల వేళ వైకాపా నేతలు భయపడి చంద్రబాబును అరెస్టు చేశారు
- ప్రజల నుంచి దూరం చేయాలని చంద్రబాబుపై కేసులు పెట్టారు
- నా తండ్రి ఎన్టీఆర్ నుంచి పౌరుషం, చంద్రబాబు నుంచి ఓర్పు నేర్చుకున్నాను
- ఐటీ ఉద్యోగుల జీవితాల్లో చంద్రబాబు వెలుగులు నింపారు
- చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో ఐటీ ఉద్యోగులు బయటికొచ్చి పోరాడారు
- చంద్రబాబు మీద ఉండే నమ్మకంతో ఐటీ ఉద్యోగులు బయటకొచ్చి పోరాడారు
- దసరా శుభాకాంక్షలు చెబుతూ ప్రజలకు చంద్రబాబు లేఖ రాశారు: భువనేశ్వరి
- ప్రభుత్వానికి ఏం పని లేనట్లు చంద్రబాబు లేఖపై విచారణ చేస్తున్నారు: భువనేశ్వరి
- లేఖపై విచారణ చేస్తూ ప్రభుత్వ సమయాన్ని వృథా చేస్తున్నారు: భువనేశ్వరి
- రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి లేఖపై విచారణ చేస్తున్నారు: భువనేశ్వరి
17:38 October 26
టీడీపీ కార్యకర్తలను బెదిరించడానికే తప్పుడు కేసులు పెడుతున్నారు
- తెదేపా కార్యకర్తలను బెదిరించడానికే తప్పుడు కేసులు పెడుతున్నారు
- తప్పుడు కేసులు పెట్టి 48 రోజులుగా చంద్రబాబును జైళ్లో పెట్టారు: భువనేశ్వరి
- పార్టీ సభ్యత్వ రుసుం తీసుకున్నారనే అంశంపై సీఐడీ విచారిస్తోంది
- చంద్రబాబు ప్రజల మనిషి: భువనేశ్వరి
- ములాఖత్‌లో మాకు ఇచ్చే సమయం 30 నిమిషాలు: భువనేశ్వరి
- 30 నిమిషాల్లో 25 నిమిషాలు చంద్రబాబు ప్రజల గురించే మాట్లాడుతారు
- చంద్రబాబు చాలా ధైర్యవంతుడు: భువనేశ్వరి
17:37 October 26
వైకాపా ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం రావాలని పోరాటం చేస్తున్నాం
- వైకాపా ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం రావాలని పోరాటం చేస్తున్నాం
- చంద్రబాబు ఆదేశాలతోనే బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నాను
- చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు
- ఇవాళ మనం చేసేదే రేపు మన భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది
- ఎవరూ భయపడవద్దు... కలిసికట్టుగా నడుంబిగించి పోరాడుదాం
17:37 October 26
తిరుపతిలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' కార్యక్రమం
- ఎప్పుడూ కుటుంబసమేతంగా తిరుమల వెళ్లే వాళ్లం: భువనేశ్వరి
- నిన్న మాత్రం ఒంటరిగా తిరుమలకు వెళ్లాల్సి వచ్చింది: భువనేశ్వరి
- మా కుటుంబసభ్యులు మెుత్తం నాలుగుదిక్కులుగా విడిపోయాం
- అనంతపురానికి చంద్రబాబు కియా మోటార్స్‌ను తీసుకొచ్చారు
- తిరుపతికి చంద్రబాబు ఫాక్స్‌కాన్ కంపెనీ తీసుకొచ్చారు
- రాష్ట్ర ప్రభుత్వం బాధలు తట్టుకోలేక కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి
- అమరరాజా కంపెనీని చాలా ఇబ్బందులు పెట్టారు
- అమరరాజా కంపెనీ రూ.9,300 కోట్లు పెట్టుబడులు పక్క రాష్ట్రంలో పెట్టింది
- కంపెనీలు మన రాష్ట్రం నుంచి వెళ్లి పక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి
- నాలుగున్నరేళ్లలో ఒక్క కంపెనీ అయినా రాష్ట్రానికి వచ్చిందా?
- చంద్రబాబు ఎస్వీ యూనివర్సిటీ నుంచే రాజకీయ జీవితం మెుదలుపెట్టారు
- చంద్రబాబుకు మద్దతుగా ధర్నా చేస్తే కేసులు పెట్టి జైళ్లో వేస్తున్నారు
17:36 October 26
- తిరుపతిలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' కార్యక్రమం
- అంకుర ఆసుపత్రి సమీపంలో మహిళలతో సమావేశంలో పాల్గొన్న భువనేశ్వరి
- తిరుపతి: 'నిజం గెలవాలి' సభకు భారీగా తరలివచ్చిన మహిళలు
14:02 October 26
మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున చెక్కులు అందజేసిన భువనేశ్వరి
- తిరుపతి జిల్లాలో రెండో రోజు భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటన
- శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటన
- చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ
- తంగెళ్లపాలెంలో మోడం వెంకటరమణ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ
- కొనతనేరిలో గాలి సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి
- కాసరంలో వెంకటసుబ్బయ్య గౌడ్ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ
- చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది వెంకటరమణ, సుధాకర్, వెంకటసుబ్బయ్య మృతి
- మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున చెక్కులు అందజేసిన భువనేశ్వరి
- సాయంత్రం తిరుపతిలోని అంకుర ఆస్పత్రి సమీపంలో మహిళలతో సమావేశం
13:09 October 26
బాబును అక్రమంగా అరెస్టుచేసి టీడీపీని దెబ్బకొట్టామనుకుంటున్న వైసీపీ సైకోలు: లోకేశ్
- అమ్మచెప్పిందంటూ.. నారా లోకేశ్ ట్వీట్
- బాబును అక్రమంగా అరెస్టుచేసి టీడీపీని దెబ్బకొట్టామనుకుంటున్న వైసీపీ సైకోలు: లోకేశ్
- చంద్రబాబును ఈ నిర్బంధాలు ప్రజల నుంచి దూరం చేయలేవు: లోకేశ్
- నిజం గెలిచి తీరుతుంది..: నారా లోకేశ్
- చంద్రబాబు ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం మరింత బలంగా పనిచేస్తారు: నారా లోకేశ్
12:55 October 26
తిరుపతి: కొనతనేరి చేరుకున్న భువనేశ్వరి
- తిరుపతి: కొనతనేరి చేరుకున్న భువనేశ్వరి
- గాలి సుధాకర్ కుటుంబసభ్యులను పరామర్శించిన భువనేశ్వరి
- సుధాకర్ కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందించిన భువనేశ్వరి
12:11 October 26
తిరుపతి జిల్లాలో రెండో రోజు భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటన
- తిరుపతి జిల్లాలో రెండో రోజు భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటన
- శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటన
- చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ
- తంగెళ్లపాలెంలో మోడం వెంకటరమణ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ
- చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మృతిచెందిన మోడం వెంకటరమణ
11:59 October 26
'నిజం గెలవాలి'పై స్పందించిన దర్శక, నిర్మాతలు రాఘవేంద్రరావు, అశ్వినీదత్
- 'నిజం గెలవాలి'పై స్పందించిన దర్శక, నిర్మాతలు రాఘవేంద్రరావు, అశ్వినీదత్
- స్పందన చూస్తుంటే నిజం నిజంగానే గెలుస్తుందనే నమ్మకం ఉంది: రాఘవేంద్రరావు
- నిజం గెలిచి ప్రజా విజయభేరి మోగించే సమయం దగ్గరలోనే ఉంది: రాఘవేంద్రరావు
- చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేక జ్వాలలు: రాఘవేంద్రరావు
- ప్రజావ్యతిరేక అరాచకాలకు అంతిమఘట్టం 'నిజం గెలవాలి': అశ్వినీదత్
09:05 October 26
Live Updates: శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాలలో సాగుతున్న భువనేశ్వరి పర్యటన
- తిరుపతి జిల్లాలో రెండో రోజు భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటన
- శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాలలో సాగనున్న భువనేశ్వరి పర్యటన
- ఉదయం 9కు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి వెళ్లనున్న భువనేశ్వరి
- ఉ. 10.30కు తంగెళ్లపాలెంలో మోడం వెంకటరమణ కుటుంబానికి పరామర్శ
- ఉ. 10.50కు కొనఠనేరిలో గాలి సుధాకర్ కుటుంబసభ్యులకు పరామర్శ
- ఉ. 11.30కు కాసారంలో వెంకటసుబ్బయ్య గౌడ్ కుటుంబానికి పరామర్శ
- సా. 4కు తిరుపతిలోని అంకుర ఆస్పత్రి సమీపంలో మహిళలతో సమావేశం