Bhuvaneswari Hunger Strike Against Chandrababu Arrest: ప్రజాధనంపై ఆశ లేదు.. ప్రజల కోసమే చంద్రబాబు పరితపించారు: నారా భువనేశ్వరి Bhuvaneswari Hunger Strike Against Chandrababu Arrest: ప్రజల సొమ్ము కోసం ఆశ పడే ఆలోచన, అవసరం తమ కుటుంబానికి లేదని నారా భువనేశ్వరి తేల్చిచెప్పారు. ప్రజల కోసమే చంద్రబాబు ప్రతిక్షణం పరితపించేవారని.. అలాంటి వ్యక్తికి జైలుకెళ్లే పరిస్థితి రావడం తనను కలిచివేస్తోందన్నారు. 'సత్యమేవ జయతే' అని నమ్మి తాను దీక్షలో చేశానన్న భువనేశ్వరి.. పాలకలు తమ కుటుంబం మొత్తాన్ని జైలు పాలు చేసినా.. కార్యకర్తలు పార్టీని నడిపిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. చంద్రబాబు అరెస్టు పరిణామాలతో మృతిచెందిన కార్యకర్తలందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దేశ, విదేశాల నుంచి తమ కుటుంబానికి సంఘీభావం తెలియజేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. ఆయన భార్య నారా భువనేశ్వరి రాజమహేంద్రవరం (Nara Bhuvaneswari Initiation in Rajamahendravaram) వేదికగా నిరశన దీక్ష చేశారు. క్వారీ సెంటర్ వద్ద.. సత్యమేవ జయతే పేరుతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగింది. ముందుగా రాజమహేంద్రవరం కంభాలచెరువు వద్ద గాంధీ విగ్రహానికి భువనేశ్వరి నివాళులు అర్పించి.. ఆ తర్వాత దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమించారు. రాజమహేంద్రవరంలో భువనేశ్వరికి చిన్నారులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఆ తర్వాత శ్రేణులనుద్దేశించి భువనేశ్వరి (Nara Bhuvaneswari Comments) ప్రసంగించారు.
Children support to Chandrababu: 'భవిష్యత్ కోసం బాబుకు అండగా ఉందాం..' ముద్దు మాటలతో ముచ్చెమటలు పట్టించారుగా..
ఎప్పుడూ ప్రజల బాగు కోసమే పరితపించారు: రాష్ట్ర ప్రజల బాగు కోసమే దీక్షలో పాల్గొన్నానని భువనేశ్వరి తెలిపారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన గాంధీజీనే జైలులో పెట్టారని అన్నారు. కుటుంబానికి కొంత సమయం కేటాయించాలని చంద్రబాబును కోరేదాన్ని.. ఆయన ఎప్పుడూ ప్రజల బాగు కోసమే పరితపించారని గుర్తు చేసుకున్నారు. తన ఆయుష్షు కూడా పోసుకుని చంద్రబాబు జీవించాలని ఆకాంక్షించారు.
ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు: తన తండ్రి, భర్త అధికారంలో ఉన్నా ఎప్పుడూ అవినీతి చేయలేదన్న భువనేశ్వరి.. ప్రభుత్వ నిధులను తాము ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని పేర్కొన్నారు. తమ కుటుంబసభ్యులపై ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్న భువనేశ్వరి.. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకెళ్లారని.. రాష్ట్రం, ప్రజల బాగు కోసమే నిత్యం ఆలోచించేవారని తెలిపారు.
Nara Bhuvaneshwari Emotional Tweet on NTR: నాన్న జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది.. ఎన్టీఆర్‌పై నారా భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్
రోజుకు 19 గంటలు కష్టపడేవారు: హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని.. ఆయనపై ఉన్న నమ్మకంతోనే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రజల కోసం చంద్రబాబు రోజుకు 19 గంటలు కష్టపడేవారని.. రోజుకు 3, 4 గంటలే నిద్రపోయేవారని చెప్పారు.
మీ ఓటును సరిగా వేయాలి: చంద్రబాబు పదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి జరిగేదని.. ఈసారి మీ ఓటును సరిగా వేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజాధనంపై తమకు ఎప్పుడూ ఆశ లేదన్న భువనేశ్వరి.. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని చంద్రబాబు కోరుకునేవారని తెలిపారు. చంద్రబాబు అరెస్టు చూసి మనస్తాపంతో 105 మంది మరణించారని.. వారి కుటుంబాలను త్వరలోనే పరామర్శిస్తానన్నారు.
Chandrababu Initiation in Rajamahendravaram Jail: 'సత్యమేవ జయతే' పేరిట జైలులో చంద్రబాబు.. బయట భువనేశ్వరి దీక్షలు
ఈ దీక్షలో తెలుగుదేశం నేతలు, శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు. జనసేన శ్రేణులూ తరలివచ్చి భువనేశ్వరికి మద్దతు పలికారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, నన్నపనేని రాజకుమారి సహా పలువురు మహిళా నేతలూ దీక్షలో కూర్చొన్నారు. జగన్ రాజకీయంగా కక్ష గట్టి చంద్రబాబును అరెస్టు చేయించారని నేతలు ఆరోపించారు.
చిన్నారులు, దివ్యాంగులు సైతం భువనేశ్వరి దీక్షా స్థలికి వచ్చి.. తమ మద్దతు తెలిపారు. చంద్రబాబు వెంటే తాము అంటూ పలికారు. హిందు, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు వచ్చి భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. బ్రహ్మకుమారీలు వచ్చి తమ మద్దతును తెలియజేశారు. వివిధ వర్గాల ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలివచ్చి.. భువనేశ్వరికి మద్దతు తెలియజేశారు. అందరికీ అభివాదం చేస్తూ భువనేశ్వరి ధన్యవాదాలు చెప్పారు.
TDP Protests in Hyderabad : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దీక్ష