గతంలో కుదుర్చుకున్న అవగాహన ప్రకారం ముఖ్యమంత్రి పదవిని టీఎస్ సింగ్ దేవ్‌కు అప్పగించేందుకు ఛత్తీస్‌గఢ్ సీఎం(chhattisgarh cm) భూపేశ్ బఘేల్ అయిష్టంగానే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం వెలువడిన వెంటనే రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నేతలతో మంగళవారం దీల్లీలోని తన నివాసంలో 3 గంటలకు పైగా చర్చించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ముఖ్యమంత్రి మార్పు విధానాన్ని కొలిక్కి తెచ్చినట్లు సమాచారం.
పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి భూపేశ్ బఘేల్, టీఎస్ సింగ్ దేవ్ సమ్మతించినట్లు.. రాహుల్‌తో భేటీ(rahul gandhi news) అనంతరం ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ పీఎల్ పునియా వెల్లడించారు. ఈ ప్రకటనను ఇద్దరు నేతలు సైతం ధ్రువీకరించారు.